సోనీ నుంచి 64జీబి మైక్రోఎస్డీ కార్డ్@రూ.5679

Posted By:

64జీబి స్టోరేజ్ మొమెరీ సామర్థ్యం కలిగిన యూహెచ్ఎస్-ఐ (UHS-I ) క్లాస్ 10 హై స్పీడ్ మైక్రోఎస్డీ కార్డ్‌ను సోనీ ఇండియా మంగళవారం ఆవిష్కరించింది. ధర రూ 5,679. ఈ మైక్రోఎస్డీ కార్డ్ సెకనుకు 40ఎంబీ వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలదని సోని పేర్కొంది. 5 సంవత్సరాల వారంటీతో లభ్యమయ్యే ఈ శక్తివంతమైన మైక్రోఎస్డీ కార్డ్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, యూవీ ప్రూఫ్, ఎక్స్-రే ప్రూఫ్, టెంపరేచర్ ప్రూఫ్ వంటి పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉందని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఈ మైక్రోఎస్డీ కార్డ్‌లోని ఫైళ్లు పొరపాటున డిలీట్ అయినట్లయితే వాటిని తిరిగి రికవర్ చేసుకోగలిగే ప్రత్యేక రికవరీ సాఫ్ట్‌వేర్‌ను తాము అందిస్తున్నట్ల కంపెనీ వెల్లడించింది.

సోనీ నుంచి 64జీబి మైక్రోఎస్డీ కార్డ్@రూ.5679

సోనీ 64జీబి మైక్రో ఎస్డీ యూహెచ్ఎస్-ఐ కార్డ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

- సెకనుకు 40ఎంబీ వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలిగే తత్వం,
- హైడిఫినిషన్ వీడియో రికార్డింగ్‌ను ఈ కార్డ్ సపోర్ట్ చేస్తుంది,
- వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, యూవీ ప్రూఫ్, ఎక్స్-రే ప్రూఫ్, టెంపరేచర్ ప్రూఫ్,
- డిలీట్ అయిన ఫైళ్లను రికవర్ చేసుకునే అవకాశం,
- 5 సంవత్సరాల వారంటీ.

మే 10 నుంచి ఈ మైక్రోఎస్డీ కార్డ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్లు ఇంకా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్‌లలో విక్రయించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot