సోని‌వయో కొత్త సరీస్ ల్యాప్‌టాప్‌లు, ఆధునిక ఫీచర్లతో..!!

Posted By: Staff

సోని‌వయో కొత్త సరీస్ ల్యాప్‌టాప్‌లు, ఆధునిక ఫీచర్లతో..!!

కంప్యూటర్ అమ్మకాల్లో మెగా ట్రెండ్‌ను సృష్టించేందుకు ‘సోని వయో’ (Sony Vaio) సిద్ధమైంది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన S సిరీస్, L సిరీస్, F సిరీస్, E సిరీస్, C సరీస్ ల్యాపీలను మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ‘సోని వయో’ మ్యూజిక్ అన్‌లిమిటెట్ ఫ్రీ‌ప్లాన్ 180 రోజుల ట్రెయిల్ కార్యక్రమాన్ని అక్టోబర్ 6 నుంచి ప్రారంభించనుంది. సంబంధింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న ‘సోని’ విక్రయ కేంద్రాలను సంప్రదించండి.
‘హై డెఫినిషన్’ నాణ్యతతో చిత్రాలను వీక్షించాలనుకునే వారికి సోని ప్రవేశపెట్టిన ‘వయో SE’, ‘వయో SA’ మోడళ్లు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. అంగుళం పల్చటి ధారుడ్యంతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీలు మన్నికైన ‘షీట్ - స్టైల్’ (sheet-style) బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటాయి. డిస్‌ప్లే అంశాలను పరిశీలిస్తే ‘వయో SE’ 15.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే‌ను కలిగి ఉండగా, ‘వయో SA’ 13.3 డిస్‌ప్లే‌తో మన్నికైన హై డెఫినిషన్ అనుభూతిని వినయోగదారుడికి కలిగిస్తుంది. వీటి ధరలను పరిశీలిస్తే రూ.50,000లకు సోని స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

‘సోని వయో’ F సిరీస్, L సిరీస్ కొత్త జనరేషన్ ల్యాపీలు ప్రీ ఇన్స్‌టాల్డ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో, అత్యాధునిక ఇంటెల్ ప్రొసెసర్‌ను కలిగి ఉంటాయి. ‘సోని వయో’ C సిరీస్, E సిరీస్ ల్యాపీలలో శక్తివంతమైన ఇంటెల్ కోర్ i7, i5 మైక్రో ప్రొసెసర్లతో ఏర్పాటు చేశారు. పింక్, సిల్వర్ వర్షన్లలో ఈ ల్యాపీలు డిజైన్ చేయుబడ్డాయి. సరికొత్త ‘బ్లాక్ వయో Y’ మోడల్‌ను సోని ఆఫర్ చేస్తుంది.

ఆడ్వాన్సడ్ టెక్నాలజీకి నాణ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను జోడించి ‘సోని వయో’ విడుదల చేసిన వివిధ సిరీస్‌ల ల్యాపీలు ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot