సోనీ నుంచి 6 కొత్త టీవీలు, ప్రారంభ ధర రూ.1,74,900

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ జపాన్ కంపెనీ సోనీ తన ఎక్స్ (X) సిరీస్ నుంచి 6 సరికొత్త బ్రావియా 4కే రిసల్యూషన్ టీవీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీల ధరలు రూ.1.74లక్షల నుంచి రూ.7.04 లక్షల మధ్య ఉన్నాయి. వీటిలో నాలుగు మోడళ్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

 సోనీ నుంచి 6 కొత్త టీవీలు, ప్రారంభ ధర రూ.1,74,900

మరో రెండు మోడళ్లను సెప్టంబర్ చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సోనీ ఇండియా తెలిపింది. ఈ టీవీలను 49 అంగుళాల నుంచి 85 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. 4కే రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన దృశ్యాలను ఈ టీవీల అందిస్తాయి. అద్భుతమైన పిక్షర్ ఇంకా సౌండ్ క్వాలిటీతో సినిమాలను వీక్షించవచ్చు.

వీడియోకాన్ నుంచి 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీలు

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ వీడియోకాన్ తమ మొట్టమొదటి 4కే రిసల్యూషన్ అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 5 మోడళ్లలో లభ్యంకున్నాన్న ఈ టీవీలను 40 నుంచి 85 అంగుళాల స్ర్కీన్ సైజు వేరియంట్‌లలో వీడియోకాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రారంభ ధర రూ.91,000.

దీపావళి నాటికి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ టీవీలను వీడియోకాన్ ఔరంగాబాద్ ప్లాంట్‌లో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ సెట్‌లను మొదటిగా ముంబయ్, థానే, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో విక్రయించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot