సోనీ 15 ఇంచ్ ల్యాప్ టాప్ బహుబాగు..

Posted By: Super

సోనీ 15 ఇంచ్ ల్యాప్ టాప్ బహుబాగు..

మార్కెట్లో ఓ ట్రెండ్ సెట్టార్‌ని క్రియేట్ చేసిన సోనీ వైవో ల్యాప్ టాప్‌లు మరలా కొత్తదనాన్ని సంతరించుకోని విడుదలవుతున్నాయి. సోనీ ల్యాప్ టాప్‌లలో ముఖ్యంగా సక్సెస్ అయిన సిరిస్ సోనీ వైవో ఎస్ సిరిస్. గతంలో సోనీ వైవో ఎస్ సిరిస్ విడుదల చేసిన అన్ని రకాల ల్యాప్ టాప్‌లు కేవలం 13.3 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉన్న విషయం తెలిసిందే. తక్కువ డిస్ ప్లేని కలిగి ఉండడంతో యూజర్స్ కొంత మంది సోనీ నిపుణులకు దీనిపై వివరణ ఇవ్వడంతో సోనీ అభిమానుల కొసం ప్రత్యేకంగా మార్కెట్లోకి 15 ఇంచ్‌తో పాటు హై డెఫినేషన్ సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

త్వరలో విడుదలకు సిద్దమైన సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్స్ 15.5 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు సూపర్బ్ పుల్ హైడెపినేషన్ డిస్ ప్లే దీని ప్రత్యేకత. సోనీ వైవో ఎస్ ల్యాప్ టాప్‌ని మాంగనీస్, అల్యూమినియం రా మెటీరియల్స్‌తో రూపోందించడం వల్ల చాలా తక్కువ బరువు(4.4 పౌండ్స్ ) మాత్రమే. స్క్రీన్ సైజు 1920 x 1080 ఫిక్సల్‌తో పాటు యాంటీ రిప్లెక్టివ్ ఫినిష్ దీని ప్రత్యేకత. సోనీ వైవో ఎస్ ల్యాప్ టాప్స్ అడుగు భాగాన బ్యాటరీ షీట్ ని ఫిక్స్ చేసి ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాటరీలు కేవలం 5గంటలు మాత్రమే పవర్ బ్యాక్ అప్‌ని ఇస్తే సోనీ వైవో ల్యాప్ టాప్‌లు 10 గంటలు పాటు బ్యాటరీ బ్యాక్ అప్‌నిస్తాయి.

సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్ ఫెర్పామెన్స్ విషయానికి వస్తే ఇందులో Intel Core i7 ప్రాసెసర్‌తో పాటు Sandy Bridge చిప్ సెట్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితోపాటు అదనంగా గ్రాఫిక్స్‌ని సపోర్ట్ చేసేందుకు గాను AMD Radeon HD 6630M గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌‍‌తో పాటు 1 GB వీడియో మొమొరీ ప్రత్యేకం. ఈ కార్డ్ ప్రత్యేకత ఏమిటంటే హై డెఫినేషన్ వీడియోలు, గేమ్స్ ని చక్కగా ప్లే చేస్తుంది. సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్‌లలో కొత్తగా టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు Dynamic Hybrid Graphics System.

15.5 ఇంచ్ సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్స్ ఈ నెలాఖరుకల్లా మార్కెట్లో లభించనున్నాయి. 13 ఇంచ్ సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్స్‌తో పోల్చితే వీటి ధర కొంచెం ఎక్కువ. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న వీటి ధర సుమారుగా రూ 43,000గా ఉండవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot