ప్రమోషన్ కోసం ఆ ‘హిరో’ 360 కోట్టు ఖర్చుపెట్డనున్నాడు..?

By Super
|
Sony Tablets and foldable


టాబ్లెట్ కంప్యూటర్లు ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దిగ్గజ సంస్థలైన శ్యామ్‌సంగ్, ఎల్‌జీలతో పాటు అనేక బ్రాండ్లు ఈ అరచేతి కంప్యూటర్లను భారత్‌లో విడుదల చేసేందుకు ఉత్సకత కనబరుస్తున్నాయి. ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన సోని ( Sony) తాజాగా టాబ్లెట్ పీసీల ఉత్పత్తి పై దృష్టి సారించింది.

దేశ వ్యాప్తంగా తమ పరిధిని విస్తరించుకునే క్రమంలో భాగంగా ‘సోని ఇండియా’ వచ్చే ఏడాది ప్రమోషన్ కోసం 360 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. సోని ‘ఎస్’ సిరీస్, ‘పీ’ సిరీస్‌లో విడుదలైన ఈ టాబ్లెట్ పీసీల ప్రమోషన్‌లో భాగంగా మూడు నెలల్లో రూ.10 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలియవచ్చింది. ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ గ్యాడ్జెట్లను సోని డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ వర్షన్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా సోని టాబ్లెట్ పీసీలు రన్ అవుతాయి. అత్యాధునిక ఫీచర్లతో సోని ‘ఎస్’ సిరీస్, ‘పీ’ సిరీస్‌లో విడుదలైన ఈ టాబ్లెట్ పీసీల ప్రారంభ ధర రూ.30,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X