‘సోని’మార్పు నిజమేనా..?

Posted By: Staff

‘సోని’మార్పు నిజమేనా..?


‘‘సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమలో సుదీర్ఘ అనుభవంతో వినియోగదారులకు విశిష్ట సేవలందిస్తున్న ‘సోని’మార్కెట్ ను మరింత విస్తరించే క్రమంలో పలు మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.’’

‘ల్యాపీ’ పరికరాల సెక్టార్లో సోని విశ్వసనీయతను చాటుతున్న ‘సోని వయో’వర్షన్ సాంకేతిక ప్రియులకు సుపరిచితమే. అయితే ‘వయో Y’ వేరియంట్లో రూపుదిద్దుకున్న నోట్ బుక్ పరికరాన్ని ‘వయో YB’గా మార్పుచేసినట్లు సోని అధికార వర్గాలు ప్రకటించాయి. ఆధునిక వర్షన్లలో రూపుదిద్దుకున్న ‘వయో YB’ ఫీచర్లు క్లుప్తంగా...

- 32-బిట్ విండోస్ 7 హొమ్ ప్రమీయమ్ ఆపరేటింగ్ వ్యవస్థను నోట్ బుక్ లో లోడ్ చేశారు.

- పొందుపరిచిన 1.6 GHz డ్యూయల్ కోర్ సీపీయూ మరియు AMD E-350 ప్రాసెసింగ్ వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- AMD రేడియన్ హై డెఫినిషన్ 6310 గ్రాఫిక్ వ్యవస్థ నాణ్యమైన గ్రాఫిక్ విజువల్స్ ను అందిస్తుంది.

- 11.6 అంగుళాల LED బ్యాక్ లైటింగ్ డిస్ ప్లే 1366x768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- శక్తివంతమైన హార్డ్ డ్రైవ్, ర్యామ్ వ్యవస్థలు పటిష్టమైన పని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

- మూడు యూఎస్బీ 2.0 పోర్టులను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు.

- మీడియా ఫోన్ జాక్స్, జిగాబిట్ ల్యాన్, వీజీఏ, ఎస్డీహెచ్సీ కార్డ్ స్లాట్, హెచ్డీఎమ్ఐ అవుట్ పీచర్లను ల్యాపీలో అమర్చారు.

- ‘ఫింగర్ ప్రింట్ వ్యవస్థ’తో పాటు ‘చిక్ లెట్ కీ బోర్డు’ వ్యవస్థలు ఆపరేటింగ్ విధానాలను మరింత సులభతరం చేస్తాయి.

- 6-cell 38Wh Li-ion బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- 802.11b/g/n వైర్ లెస్ వ్యవస్థ డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది.

- అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘సోని వయో’ నోట్ బుక్ బరువు కేవలం 3.24 పౌండ్లు మాత్రమే.

- ధర అంశాన్ని పరిశీలిస్తే ‘సోని వయో YB’ మార్కెట్ ధర రూ. 26,760.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot