సోనీ ఎస్ 1, ఎస్ 2ల పై అంచనాల జోరు..

By Super
|
Sony S1
‘సోనీ’ ఈ బ్రాండ్ పేరు తెలియని వారు ఉండరు... ప్రపంచ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ‘సోనీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఆధునీకరిస్తూ వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. సోనీ ఎస్ 1, ఎస్ 2ల పేరుతో రెండు టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టాబ్లెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 26న టోక్యోలో విడుదల చేశారు.

‘క్లాసికల్‌ లుక్’ తో తీర్చిదిద్దిన ఎస్ 1, ఎస్ 2 టాబ్లెట్లు మార్కెట్లో మంచి హిట్ కొట్టడం కాయమని సోనీ వర్గాలు భావిస్తున్నాయి. వినూత్న శైలిలో ఉన్న రెండు మోడల్స్ వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. టెక్నాలజీతో పాటు అధునాతన ఫీచర్స్‌ను ఈ స్టైలీ పీసీలలో పొందుపరిచారు. ‘గుగూల్ ఆండ్రాయిడ్ 3.0 హనీ కాంబ్’ ఆపరేటింగ్ వ్యవస్థతో ఈ టాబ్లెట్లనురూపొందించారు. కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను సమృద్ధిగా లబ్ధిదారులకు అందించేందుకు సోనీ ఈ ప్రయోగం తలపెట్టింది.

వినూత్న ప్రయోగాలకు వేదికగా నిలిచే ‘సోనీ’ ఈ టాబ్లెట్లలో కొత్త అంశాలను పొందుపరిచింది. ఎస్ 1 టాబ్లెట్లు ‘సింగిల్ స్ర్కీన్’ సామర్థ్యం కలిగి ఉంటే, ఎస్ 2 టాబ్లెట్లు మాత్రం ‘డ్యూయాల్ స్ర్కీన్’ సామర్థ్యం కలిగి ఉంటుంది. 9.4 అంగుశాల వైశాల్యం కలిగిని ఎస్ 1 టాబ్లెట్లు ‘డిస్ ప్లే’ , వెబ్ బ్రౌజింగ్ చేసుకునేందుకు సులువుగా ఉండటంతో పాటు ఇతర అంశాలలో ‘గుడ్ లుకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను’ వినియోగదారుడికి అందిస్తుంది. ఇక ఎస్ 2 విషయానికి వస్తే ఇది ‘ఫోల్డెడ్ టైప్’ టాబ్లెట్ అంటే పాకెట్ సైజ్ అన్న మాట. ఈ టాబ్లెట్ ను ‘ఫోల్డ్’ చేసినప్పుడు మనకు ఒక డిస్‌ప్లే మాత్రమే కనిపిస్తుంది, అదే ‘అన్ ఫోల్డ్’ లో ఉంచినప్పుడు రెండు డిస్‌ప్లే‌లు మనకు కనిపిస్తాయి. 5.5 అంగుళాల వైశాల్యం కలిగిని ‘డ్యూయల్ డిస్ ప్లే’ ఒక సమయంలో వెబ్ బ్రౌజ్ చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు ‘పేజ్ వ్యూ’ కు ఉపకరిస్తుంది. 1024 x 480 పిక్సల్ రిసల్యూషన్ తో కూడిన వీడియో విజువల్ అనుభవాన్ని వినియోగదారుడికి ఈ టాబ్లెట్లు అందిస్తాయి.

శక్తివంతమైన హై స్పీడ్ వై - ఫై సామర్థ్యాన్ని ఎస్ 1 టాబ్లెట్ లో పొందుపరిచారు. ఈ వై - ఫై ఎటువంటి అవాంతరాలు లేకుండా పని చేస్తుంది. వై - ఫై సామర్థ్యం కలిగి ఉన్న ఎస్ 2లో అదనంగా 3జీ సపోర్టు చేసే AT&T వ్యవస్థను జోడించారు. వేగవంతమైన ‘టచ్ స్క్రీన్’ సామర్థ్యంతో పాటు వేగవంతమైన ‘పేజ్ వ్యూ’ సౌలభ్యాలు వినియోగదారుడి విలువైన సమయాన్ని ఆదా చేస్తాయి. వేగవంతంగా వెబ్ సైట్లను లోడ్ చేయడంతో పాటు 8 సెకన్ల వ్యవధిలోని వెబ్ పేజీని ఈ టాబ్లెట్లు లోడ్ చేసుకుంటాయి.

ఆధునాతన ‘గేమింగ్ వ్యవస్థ’తో పాటు హై డెఫినిషన్ వీడియో ప్లే బ్యాక్, కెమెరాలను ఈ టాబ్లెట్ల లో వ్యవస్థీకరించారు. ఈ టాబ్లెట్లలో పొందుపరిచిన సమర్ధవంతమైన ఆపరేటింగ్ వ్యవస్థ 3జీ, 4జీ నెటవర్క్‌లకు సహకరిస్తుంది. ఆధునాత ఫీచర్స్‌తో రూపుదిద్దుకున్న ఈ సోనీ టాబ్లెట్లు అమెరికన్ మార్కెట్లోకి అగష్టులో రానున్నాయి. విశ్లేషకుల భారీ అంచనాలతో ఊరిస్తున్న సోనీ టాబ్లెట్లు ఆసియన్ మార్కెట్లోకి మాత్రం త్వరలో రానున్నాయి. అయితే వీటి ధరలు ఇండియాలో మాత్రం రూ.27వేలు ఉండవచ్చని అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X