‘శ్యామ్‌సంగ్’ జోరు.. ‘సోని’ హోరు..!!

Posted By: Super

‘శ్యామ్‌సంగ్’ జోరు.. ‘సోని’ హోరు..!!

ప్రతి సారీ ఏదో ఒక కొత్తదనాన్ని రుచి చూపించే ‘సోని’, తాను తాజాగా ప్రవేశపెట్టబోతున్న ‘సోని S1’ టాబ్లెట్లో వినూత్నఒరవడితో రూపొందిచిన ప్లేయింగ్ స్టేషన్ వ్యవస్థను వినియోగదారులకు పరిచయం చేయబోతుంది. ప్రస్తుత గణాంకాలతో పాటు ఫీచర్లను విశ్లేషిస్తే సోని టాబ్లెట్ ఇతర టాబ్లెట్లతో పోలిస్తే మెరుగైన పనితీరును కలిగి ఉందని తెలుస్తోంది.

ఈ కోవలోనే మరో బ్రాండ్ శ్యామ్‌సంగ్ తన సత్తాను చాటుకుంటుంది. టాబ్లెట్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన శ్యామ్ సంగ్, గెలక్సీ ‘Tab 10.1’ పేరుతో ఓ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసి తన హవాను కొనసాగిస్తుంది.

ఈ టాబ్లెట్ల డిస్‌ప్లే అంశాలను పరిశీలిస్తే సమానమైన 1280 X 800 రిసల్యూషన్ కలిగి ఉంటాయి. ఇక టచ్‌స్ర్కీన్ విషయానికి వస్తే ‘గెలక్సీ 10.1’, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ స్వభావం కలిగి ఉండగా, ‘సోని S1’ మాత్రం 9.4 అంగుళాల టచ్ స్క్రీన్ స్వభావం కలిగి ఉంటుంది.

కెమెరా అంశాలను పరిశీలిస్తే, గెలక్సీ 10.1, 3 మెగా పిక్సల్ సామర్ధ్యంతో ఎల్‌ఇడి ఫ్లాష్ మరియు ఫోకస్ ఆఫ్షన్ కలిగి ఉంది. హైఫర్ డెఫినిషన్ (HD) కలిగిన వీడియో ప్లే బ్యాక్, ఫ్రంట్ కెమెరా వంటి అంశాలు వీడియో ఛాటింగ్ తదితర వెసలబాటులను వినియోగదారులకు కల్పిస్తాయి. సోని ‘S1’ విషయానికి వస్తే కెమెరా సామర్థ్యానికి సంబంధించి ఎటువంటి స్పెసిఫికేషన్లు విడుదల కాలేదు. అయితే ఈ టాబ్లెట్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను అనుసంధానిస్తున్నట్లు సమచారం.

ప్రొసెస్సర్ల విషయానొకొస్తే గెలక్సీ ‘10.1’ డ్యూయల్ కోర్ సామర్ధ్యం గల 1GHz టెగ్రా 2 ప్రొసెస్సర్‌తో పాటు 1 జీబీ ర్యామ్ సామర్ధ్యం కలిగి ఉంది. సోని ‘S1’ లో సాధారణ డ్యూయల్ కోర్ టెగ్రా‌చిప్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ర్యామ్‌కు సంబంధించి ఎటువంటి సమచారం తెలియరాలేదు. ఇక మెమరీ విషయానిక వస్తే గెలక్సీ ‘10.1’, 16, 32, 64 GBల సామర్ధ్యం కలిగిన వివిధ వారియంట్ వర్షన్లలో లభ్యమువుతున్నాయి.

హనీకూంబ్ ఆండ్రాయిడ్ వ్యవస్ధ సరికొత్త వర్షన్ 3.1 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా గెలక్సీ ట్యాబ్ ‘10.1’ రూపుదిద్దకుంది. సోని ‘S1’లోనూ హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసినప్పటికి, వర్షన్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే రెండు టాబ్లెట్ పీసీలు అడ్వాన్స్ ఫీచర్లతో రూపొందించబడ్డాయి. శ్యామ్‌సంగ్ ‘గెలక్సీ ట్యాబ్ ‘10.1’ ఇప్పటికే మార్కెట్లో విడుదలై సంచలనాలు సృష్టిస్తుండగా, సోని ‘S1’ త్వరలో విడుదల కాబోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot