5000 ఉద్యోగాలకు సోనీ ఎసరు!

Posted By:

ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో గత కొంత కాలంగా నిరాశజనకమైన ఫలితాలను నమోదు చేస్తున్న సోనీ తన ఖర్చును మరింతగా తగ్గించుకునేందకు 5,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా వ్యక్తిగత కంప్యూటర్లు, టీవీ యూనిట్ల విభాగంలో సోనీ వ్యాపారం మందకొడిగా సాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసకున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

5000 ఉద్యోగాలకు సోనీ ఎసరు!

సోనీ తన పీసీ డివిజన్‌ను ప్రముఖ పెట్టుబడి ఫండ్ జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్కు విక్రయించే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జూలై 2014 నాటికి టీవీ విభాగాన్ని సైతం సోనీ ప్రత్యేక కంపెనీగా విభజించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మార్చి 2015 నాటికి పూర్తి కానుంది. ఈ ప్రభావం ముఖ్యంగా టీవీ ఇంకా పీసీ డివిజన్ల పై ఉంటుంది.

సోనీ నుంచి విండోస్ పోన్..?

విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే యోచనలో సోనీ నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా సోనీ, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే రూపొందింస్తూ వస్తోంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌తో ఏర్పరుచుకోబోయే భాగస్వామ్యం సోనీ మార్కెట్‌ను మార్చేసే అవకాశముందని నిపుణుల అంచనా. సీనెట్ తెలిపిన వివరాల మేరకు సోనీ, మైక్రోసాఫ్ట్‌ల ఒప్పందం వాస్తవమే అయితే, సోనీ మొట్టమొదటి సారిగా విండోస్ ఫోన్‌ల ప్రపంచంలోకి ప్రవేశించినట్లవుతుంది. మరోవైపు తన మొబైల్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తృతం చేసే క్రమంలో మైక్రోసాఫ్ట్ ఇతర మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot