ఏప్రిల్‌లో వాళ్లూ ఆ తీర్థమే పుచ్చుకుంటారు..?

Posted By: Super

ఏప్రిల్‌లో వాళ్లూ ఆ తీర్థమే పుచ్చుకుంటారు..?

 

గ్యాడ్జెట్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ రెట్టింపవుతుంది. ప్రముఖ కంపెనీలు ఈ వోఎస్ వాడకం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ వరసలో దిగ్గజ సోనీ కూడా ఉండటం విశేషం. పీ, ఎస్ మోడల్స్‌లో సోనీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన టాబ్లెట్ పీసీలకు ఈ ఏప్రిల్‌లో  ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ వర్తించనుంది. ఈ ప్రకటనను సోనీ జపాన్ వెలువరించింది. ఇదే సమయంలో ఈ

అప్‌డేట్ ఇండియాలో ఉన్న ఎస్, పీ టాబ్లెట్‌లకు సైతం వర్తించనుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ వోఎస్ అప్‌డేట్ ద్వారా మల్టీ టాస్కింగ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. పీ, ఎస్ టాబ్లెట్ పీసీల యూజర్లు ఈ నవీకరణతో పాటు మరో కొత్త అప్లేకేషన్ సేవలను సద్వనియోగం చేసుకోవచ్చు. Recopla అనే అప్లికేషన్‌ను సోనీ ఈ అప్‌డేట్ ద్వారా తమ యూజర్లకు అందించనుంది. ఈ ఫీచర్ ప్రధాన లక్షణం టీవీ కార్యక్రమాలను వై-ఫై వ్యవస్ధ ద్వారా ప్రత్యక్షంగా స్ట్రీమ్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot