సోనీ నుంచి అల్ట్రా హైస్పీడ్ మెమరీ కార్డులు

Posted By:

సురక్షితమైన డేటా స్టోరేజ్ ఇంకా వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ వ్యవస్థతో కూడిన సరికొత్త అల్ట్రా హైస్పీడ్ ఎస్డీ కార్డులను సోనీ ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. యూజెడ్ (UZ) సిరీస్ నుంచి విడుదలైన ఈ ఎస్డీ కార్డ్‌లను.. కెమెరా అలానే స్మార్ట్‌ఫోన్‌ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 32 ఇంకా 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ కార్డులను అందుబాటులో ఉంచారు. డేటా ట్రాన్స్‌ఫర్ వేగం 95ఎంబీ/ఎస్ (రీడ్), 90ఎంబీ/ఎస్ (రైట్). ప్రత్యేకమైన సోనీ ఫైల్ రెస్క్యూ సాఫ్ట్‌వేర్‌ను ఈ మెమరీ కార్డ్‌లు కలిగి ఉన్నాయి.

సోనీ నుంచి అల్ట్రా హైస్పీడ్ మెమరీ కార్డులు

ఈ టెక్నాలజీ సాయంతో మెమరీ కార్డ్‌లో అనుకోకుండా డిలీట్ అయిన డేటాను తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అన్ని రకాల ప్రతికూల వాతావరణాలను ఈ ఎస్డీ కార్డులు తట్టుకుంటాయి. 32జీబి వర్షన్ (SF-32UZ/T1) సోనీ యూహెచ్ఎస్ - 1 యూ3 మెమరీ కార్డ్ ధర రూ.5,339, 64జీబి వర్షన్ (SF- 64UZ/T1) సోనీ యూహెచ్ఎస్ - 1 యూ3 మెమరీ కార్డ్ ధర రూ.9,942. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్లు అలానే ప్రముఖ ఎలక్ట్రానిక్  స్టోర్‌లలో ఈ అల్ట్రా హైస్పీడ్ మెమెరీ కార్డులు లభ్యమవుతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Sony UZ Series Ultra High Speed SD Cards Launch in India. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting