సోని వయో ల్యాప్‌టాప్ ఇప్పుడు ‘ఈ’ సిరీస్‌లో

Posted By: Super

సోని వయో ల్యాప్‌టాప్ ఇప్పుడు ‘ఈ’ సిరీస్‌లో

సక్సెస్ ఫుల్ డెరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఈగ’ త్వరలో ప్రేక్షకులను కుట్టబోతున్న విషయం తెలిసందే. విజయం పరంపరలతో దూసుకుపోతున్న స్టార్ బ్రాండ్ సోని ‘ఈ’ రేంజ్‌లో ఓ గ్యాడ్జెట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఎలక్ట్ర్రానిక్ పరికరాల పరిశ్రమలో విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘సోని’కంప్యూంటిగ్ విభాగంలో అదే బాహుటాను ఎగరవేసింది. మన్నికైన పర్సనల్ కంప్యూటర్లు మరయు ల్యాప్‌టాప్ పరికరాలను తనదైన శైలిలో మార్కెట్లో విడుదల చేసింది.

విస్తరణలో భాగంగా సోని ‘వయో ఈ సిరీస్’ ల్యాపీలను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తులు షురూ చేసింది. ‘VPCEH1FGX’ మోడల్ వర్షన్లో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ అపగ్రేడేషన్ ఫీచర్లతో ఊరిస్తుంది. సాంకేతిక పరికరాల తయారీ విభాగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ‘సోని’ తాజా ఆవిష్కరణతో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని యోచిస్తుంది.

సోని వయో ‘ఈ’ సిరీస్‌లోని విశిష్ట ఫీచర్లను పరిశీలిస్తే.. విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టమ్, 2.3 GHz ఇంటెల్ కోర్ i5-2410M ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 500జీబీ హార్డ్ డ్రైవ్, న్విడియా జీఫోర్స్ గ్రాఫిక్ కార్డ్ వంటి అంశాలు మన్నికైన పనితీరు కలిగి ఉంటాయి.

డిస్ ప్లే అంశాలను పరిశీలిస్తే 15.5 అంగుళాల స్క్రీన్ 1, 366 x 768 పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ల్యాపీ బరువు 6.0 ల్యాబ్స్. 802.11 b/g/ n వై-ఫై కనెక్టువిటీ వ్యవస్థ సమాచారాన్ని వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. యూఎస్బీ 2.0 పోర్ట్సు, వీజీఏ, హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్ అంశాలు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.

అమర్చిన 3500 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆధునిక హుంగులతో అతి త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘సోని ఈ - సిరీస్’ ల్యాపీ ధర రూ.40,000 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot