'సోనీ' సూపర్ ఆఫర్.. 3డీ గ్లాసెస్ 'ఫ్రీ'

Posted By: Staff

'సోనీ' సూపర్ ఆఫర్.. 3డీ గ్లాసెస్ 'ఫ్రీ'

సోనీ కంప్యూటర్ పరిశ్రమలో నాణ్యమైన ఉత్పత్తలు విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా మంచి కస్టమర్స్‌‍ని సంపాదించుకుంది. సోనీ అందించేటటువంటి ఉత్పత్తులలో నాణ్యత, అధునాతన టెక్నాలజీలు ఇమిడి ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. సోనీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న సోనీ వైవో ఎస్ ల్యాప్ టాప్ లను కొనుగోలు చేస్తే ఇప్పడు 3డీ గ్లాసెస్ ఫ్రీ అంటూ ప్రకటించింది. ఐతే ఈ 3డీ గ్లాసెస్ కేవలం 3డీ డిస్ ప్లే వాటికి మాత్రమే.

రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీని ఆధారంగా చేసుకొని సోనీ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. యూజర్స్ ఎప్పుడైతే 3డి ఎక్స్ పీరియన్స్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద అలా ఒక్క క్లిక్ నోక్కితే చాలు. ఈ ఫీచర్ కేవలం సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్స్ మాత్రమే నిక్షిప్తం చేయడం జరిగింది. సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్ మార్కెట్లోకి ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ని కలిగి ఉండి, పవర్ పుల్ 2.30 GHzతో వస్తుంది.

సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని సమాచారం. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇందులో ఇనిస్టాల్ చేయడం వల్ల ల్యాప్ టాప్ ఫెర్పామెన్స్ లెవల్ కూడా ఫాస్టుగా ఉంటుంది. ల్యాప్ టాప్ స్క్రీన్ డిస్ ప్లే 16.4 ఇంచ్‌గా ఉండి, స్క్రీన్ రిజల్యూషన్ 1920*1080 ఫిక్సల్‌గా రూపొందించనున్నారు. ల్యాప్ టాప్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని విస్తరించుకోవచ్చు.

సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, బ్లూ రే డిస్క్ ప్రత్యేకం. ల్యాప్ టాప్‌లో 8జిబి మొమొరీ మెయిన్ మొమొరీగా లభిస్తుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే USB 2.0, USB 3.0 రెండు పోర్ట్‌లు ల్యాప్ టాప్‌తో లభించనున్నాయి. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే టచ్ ప్యాడ్ టెక్నాలజీతో, బ్లాక్‌లిట్ కీబోర్డ్, హెడ్ ఫోన్స్, మైక్రో ఫోన్స్ మొదలగునవి ప్రత్యేకం. ల్యాప్ టాప్ బరువు 3.2 కిలోగ్రాములు. ఇందులో నిక్షిప్తం చేసిన లిధియమ్ బ్యాటరీ సహాయంతో బ్యాటరీ బ్యాక్ అప్ 3గంటలు పాటు వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 40,000 వరకు ఉండవచ్చునని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. సోనీ వైవో ఎస్ సిరిస్ ల్యాప్ టాప్‌తో 3డీ గ్లాసెస్ కూడా ఫ్రీగా లభించనున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot