ప్రపంచ వ్యాప్తంగా విఖ్యాత దిగ్గజంగా పేరొందిన ‘సోని’ నాజూకైన సాంకేతిక వస్తువులతో మరో సారి వినియోగదారును ఆకట్టకునే ప్రయత్నం చేస్తుంది. సోని వయోఎస్ (Sony VAIO S) సరీస్‌లో పలు మోడళ్ల ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేయునుంది. 15 అంగుళాల సామర్ధ్యంలో సోని వయోఎస్ (Sony VAIO S) మ్యాక్ బుక్ ల్యాపీను రూపొందించింది. బ్లాక్ ఆల్యూమినియంతో పాటు ప్లాటినం సిల్వర్ రంగుల్లో ఈ ల్యాపీ దర్శనమిస్తుంది.
హై డెఫినిషన్ నాణ్యత కిలిగిన ఈ ల్యాపీ ఆడియో విషయంలో కాస్తంత నిరుత్సాహపరుస్తుంది. సినాప్టిక్ టచ్ ప్యాడ్, బ్యాక్ లిట్ కిబోర్డు వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ల్యాపీలో పొందుపరిచిన రెండు యూఎస్బీ పోర్టులు 2.0, v3.0 సామర్ధ్యం కలిగి ఉంటాయి. పొందుపరిచిన హెడీ ఎమ్ ఐ, వీజీఏ, ఇతర్నెట్ వంటి అంశాలు అద్భుతమైన పనితీరును కలిగి ఉంటాయి.
1280 X 1024 రిసల్యూషన్ సామర్ధ్యం కలిగిన కెమెరా నాణ్యమైన వీడియోలను మీకు అందిస్తుంది. ఇంటెల్ కోర్ i5- 2520M ప్రొసెసర్, టర్బో బూస్ట్ 3.20 GHz, విండోస్ 7 వంటి అంశాలు మరిత బలాన్ని చేకూరుస్తాయి. అయితే సోని విడుదల చేసిన 13 అంగుళాల Sony VAIO S ధర రూ.62,990 పలుకుతుండగా, 15 అంగుళాల Sony VAIO S ధర రూ.72,000 మధ్య ఉంటుంది.