‘సోని’ ల్యాపీలు రూ.45000 నుంచి 1,50,000 వరకు

Posted By: Super

‘సోని’ ల్యాపీలు రూ.45000 నుంచి 1,50,000 వరకు


‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు సోని అధునాతన ల్యాప్ టాప్ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. సోని వయో ఎస్(S), జడ్ (Z) సిరీసుల్లో విడుదలవుతున్న ఈ ల్యాపీలు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాయి.’’

క్లుప్తంగా సోని వయో ‘ఎస్’ సిరీస్ ఫీచర్లు:

- ల్యాపీలు 13 అంగుళాల సైజును కలిగి, 2.1కిలోల బరువును కలిగి ఉంటాయి.
- ‘విండోస్ 7’ జెన్యున్ వర్షన్స్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ ల్యాపీ పనితీరు ఉంటుంది.
- ఇంటెల్ కోర్ i5, i7 ప్రొసెసింగ్ వేరియంట్లలో ఈ ల్యాపీలను ఎంపికచేసుకోవచ్చు.
- 4.30 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం, అత్యాధునిక బ్లూటూత్, హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్, ఆధునిక యూఎస్బీ పోర్టు అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధిని చేకూరుస్తాయి.
- వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ‘ఎస్’ సిరీస్ ల్యాపీ ధరలను పరిశీలిస్తే రూ.45000 నుంచి రూ.65,000వరకు లభ్యమవుతున్నాయి.

క్లుప్తంగా సోని వయో ‘జెడ్’ సిరీస్ ఫీచర్లు:

- 13 అంగుళాల సైజు పరిమాణం కలిగి 1.16 కిలో గ్రాముల బరువుతో ‘జెడ్’ సరీస్ ల్యాపీలు రూపుదిద్దుకున్నాయి.
- కొత్త జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రొసెసింగ్ వ్యవస్థను టర్బో బూస్ట్ సామర్ధ్యంతో ల్యాపీలో పొందుపరిచారు.
- హై డెఫినిషన్ రిసల్యూషన్ గల డిస్ ప్లే, నాణ్యమైన గేమింగ్ అనూభూతి ఈ ల్యాపీలో వినియోగదారుడికి కలుగుతుంది.
- ఇంటెల్ కార్డు, 1జీబీ ర్యామ్, AMD Radeon ™ HD 6650 GPU వంటి వ్యవస్థలు సమర్ధవంతమైన పనితీరును కలిగి ఉంటాయి.
- 6.5 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం, అత్యాధునిక బ్లూటూత్, హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్, ఆధునిక యూఎస్బీ పోర్టు అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధిని చేకూరుస్తాయి.
- వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ‘జెడ్’ సిరీస్ ల్యాపీల ధరలు రూ.95000 నుంచి రూ. 1, 50,000 వరకు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot