ఫ్లాష్..ఫ్లాష్, మీడియా చేతిలో ఆ కీలక వివరాలు?

Posted By: Super

ఫ్లాష్..ఫ్లాష్, మీడియా చేతిలో ఆ కీలక వివరాలు?

జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ‘టాబ్లెట్ ఎస్’కు సక్సెసర్‌గా మరో టాబ్లెట్ పీసీని వృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ జర్మన్ సైట్ ‘మొబిఫ్లిప్’ఈ తాజా అప్‌టేట్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. ఈ సైట్ వెల్లడించిన సమాచారం మేరకు సోనీ కొత్త టాబ్లెట్ నాజూకైన డిజైనింగ్‌తో తక్కువ బరువును కలిగి శక్తవంతమైనదిగా ఉంటుందని తెలుస్తోంది.

వెర్జ్ నివేదిక ప్రకారం సరికొత్త సోనీ ఎక్స్‌పీరియా టాబ్లెట్ ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు:

9.4 అంగుళాల టచ్ స్ర్కీన్,

శక్తివంతమైన టెగ్రా 3 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,

ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి, 64జీబి వర్షన్‌లలో,

3జీ కనెక్టువిటీ, వై-ఫై బ్రౌజింగ్,

10గంటల మన్నికైన బ్యాకప్ నిచ్చే 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

టాబ్లెట్ ఎస్‌తో పోలిస్తే 42శాతం నాజూకైన శరీరాకృతి,

మైక్రోసాఫ్ట్ సరఫేస్ టాబ్లెట్ తరహాలో స్మార్ట్ కవర్ కీబోర్డ్.

ధర ఇంకా విడుదల తేదీ:

16జీబి, 32జీబి, 64జీబి మెమరీ వర్షన్ లలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర వేరియంట్ ను బట్టి రూ. 25,000, రూ. 30,000. రూ. 35,000 ఉండొచ్చని మార్కట్ వర్గాల అంచనా. ఈ డివైజ్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమచారాన్ని సోనీ ప్రకటించలేదు. మార్కెట్ వర్గాల అంచనా మేరకు సెప్టంబర్ లో ఈ గ్యాడ్జెట్ ను విడుదల చేసే అవకాశ ముంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot