మెమురీ స్పేస్‌ను భారీగా పెంచే ‘ఎంరామ్’

Posted By:

మెమురీ  స్పేస్‌ను భారీగా పెంచే ‘ఎంరామ్’

స్మార్ట్‌ఫోన్ ఇంకా ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మెమరీ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసే సరికొత్త టెక్నాలజీని సింగిపూర్ శాస్త్రవేత్తలు వృద్ధి చేసారు. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం (ఎన్ యూఎస్) ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుల బృందం ‘మ్యాగ్నటోరెసిస్టవ్ ర్యాండమ్ యాక్సెస్ మెమురీ' (ఎంరామ్)ను రూపొందించింది. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మెమురీ స్పేస్‌ను భారీగా పెంచుతుందని పరిశోధకుల బృందం తెలిపింది.

ఈ రామ్ అనుసంధానించబడిన కంప్యూటర్ పై పని చేస్తున్నప్పుడు ప్రతీసారీ సేవ్ చేయవల్సిన అవసరం ఉండదని నిపుణులు వివరించారు. ఈ అత్యాధునిక ర్యామ్ వ్యవస్థలో దాచిన సమాచారం 20 సంవత్సరాల పాటు చెక్కుచెదరదని నిపుణుల బృందం పేర్కొంది. అంతేకాకుండా, ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన మొబైల్ ఫోన్‌లను పదేపదే ఛార్జ్ చేయావల్సిన అవసరం ఉండదని, వారానికి ఒకరోజు ఛార్జ్ చేస్తే సరిపోతుందని తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot