ఆండ్రాయిడ్ , విండోస్‌లతో విసిగిపోయారా.. ఇదిగో లైనెక్స్!!

Posted By: Staff

ఆండ్రాయిడ్ , విండోస్‌లతో విసిగిపోయారా.. ఇదిగో లైనెక్స్!!

 

ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే టాబ్లెట్ పీసీలను మనం చూశాం.. విండోస్ ఆధారితంగా పనిచేస్తున్న టాబ్లెట్‌లను చూస్తున్నాం... ఈ రెండింటికి భిన్నంగా లైనెక్స్ బేసిడ్ టాబ్లెట్ రాబోతుంది. స్పార్క్ సంస్థ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

స్పార్క్ టాబ్లెట్‌గా డిజైన్ కాబడిన ఈ లైనెక్స్ బేసిడ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌కు వచ్చే వారం నుంచి ముందస్తు బుకింగ్ నిర్వహించనున్నారు.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

* లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,

* 1GHz AMLogic ప్రాసెసర్,

* మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* ఇంటర్నల్ మెమెరీ 4జీబి,

* 512ఎంబీ ర్యామ్.

టాబ్లెట్ స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాల కలిగి టచ్ ఆధారితంగా స్పందిస్తుంది. మైక్రో ఎస్డీ సపోర్ట్ ద్వారా డివైజ్ మెమెరీని పెంచుకోవచ్చు. పొందుపరిచిన వై-ఫై వ్యవస్థ నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. ధర రూ.13,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot