స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే స్పీకర్

Posted By:

సాధారణంగా స్పీకర్లు అనేవి శబ్ధాలను బెగ్గరగా వినిపించేందుకు దోహదపడతాయి. అయితే, లాస్‌యాంజిల్స్ చెందిన అవుట్‌డోర్ టెక్ సంస్థ రూపొందించిన ఓ స్మార్ట్ స్పీకర్ మాత్రం మ్యాజిక్‌ను బెగ్గరగా వినిపించటంతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను, ఐప్యాడ్‌లను చార్జ్ చేసేస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే స్పీకర్

బిగ్ టర్టిల్ షెల్ (Big Turtle Shell)గా పిలవబడుతున్న ఈ స్పీకర్ల ద్వారా మ్యూజిక్ వింటూనే మీ ఐప్యాడ్ ఇంకా  స్మార్ట్‌ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్లలో ఏర్పాటు చేసిన శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ సింగిల్ చార్జ్ పై 16 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అదే సమయంలో ఇతర డివైస్‌లను చార్జ్ చేసేస్తుంది.

ఈ బహుళ ఉపయోగకర స్పీకర్లు తరచూ విహారయాత్రలు, అవుడ్ డోర్ పార్టీలలో పాల్గొనే వారికి మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. వాటర్ రెసిస్టెంట్, షాక్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, శాండ్ ప్రూఫ్ వంటి ఫీచర్లు స్పీకర్లను ప్రమాదాల నుంచి పూర్తిగా రక్షిస్తాయి. బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3.5ఎమ్ఎమ్ పోర్ట్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot