‘స్పైస్’ చవక టాబ్లెట్లు!!

Posted By: Staff

‘స్పైస్’ చవక టాబ్లెట్లు!!

భారతీయ దిగువ, మధ్యతరగతి మొబైల్ మార్కెట్లో అత్యధిక వాటాను కైవసం చేసుకున్న ‘స్పైస్ మొబైల్స్’, తాజాగా టాబ్లెట్ సెగ్మంట్‌లోకి అడుగుపెట్టనుంది. మరో రెండు నెలల్లో, రెండు సరికొత్త టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టనున్నట్లు బ్రాండ్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్నఈ గ్యాడ్జెట్ల ధరలు రూ.20,000లోపే.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకుంటున్న ఈ టాబ్లెట్ పీసీలు 9.7 అంగుళాల స్ర్ర్కీన్ సైజును కలిగి ఉంటాయి. టాబ్లెట్ల మోడళ్లను పరిశీలిస్తే ఒకటి ‘బడ్జెట్ టాబ్లెట్’గా మరొకటి ఉన్నత శ్రేణులు కోరుకునే విధంగా హై స్పెసిఫికేషన్లతో రూపొందించినట్లు స్పైస్ మార్కెటింగ్ మేనేజర్ పాయల్ గాబా తెలిపారు.

శక్తివంతమైన 800MHz క్వాల్కమ్ ‘స్నాప్ డ్రాగెన్ ప్రొసెసర్’ మరియు ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థలు టాబ్లెట్ మెరుగైన పనితీరుకు దోహదపడతాయని గాబా పేర్కొన్నారు.

800/480 రిసల్యూషన్‌తో 7 అంగుళాల ‘టచ్ స్ర్ర్కీన్ డిస్‌ప్లే’, హై డెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, అత్యాధునిక వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ వంటి అంశాలు సమాచార వ్యవస్థను మరిత పటిష్టితం చేస్తాయి. టాబ్లెట్ల వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థలు మన్నికైన పనితీరును కలిగి ఉంటాయి. వీడియో మరియు ఆడియో ప్లేయర్ ఫీచర్లను పరికరాల్లో పొందుపరిచారు.

స్టిరీయోఫోనిక్ హెడ్‌సెట్లను టాబ్లెట్‌కు జత చేసుకునే విధంగా 3.5mm జాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 155 ఎంబీ ఇంటెర్నల్ మెమరీ సామర్ధ్యాన్ని ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు. కేవలం 485 గ్రాముల బరువుండే ఈ గ్యాడ్జెట్లలో శక్తివంతమైన 4200 mAh బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 500 గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot