ఆండ్రాయిడ్ ఆధారిత ‘స్పైస్ MI 720’..!!

Posted By: Staff

ఆండ్రాయిడ్ ఆధారిత ‘స్పైస్ MI 720’..!!

‘‘ఆండ్రాయిడ్ ఆధారిత అధునాతన టాబ్లెట్ పీసీలను తక్కువ ధరతో వినియోగదారులకు అందించేందుకు ప్రముఖ గ్యాడ్జెట్ల తయరీదారు స్పైస్ సన్నాహాలు చేస్తుంది. టాబ్లెట్ పీసీలో స్మార్ట్ ఫోన్ తరహా వ్యవస్థను పొందుపరిచిన ‘స్పైస్ MI 720’ పరికరాన్ని వచ్చే వారం మార్కెట్లో విడుదల చేసేందుకు సంస్థ ఏర్పాట్లు పూర్తిచేసింది. సంవత్సర కాలం వారెంటీతో లభ్యమవునున్న స్పైస్ గ్యాడ్జెట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఊపందుకున్నాయి.’’

ఫీచర్లు క్లుప్తంగా:

- ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ వ్యవస్ధ ఆధారితంగా ఈ టాబ్లెట్ కమ్ స్మార్ట్ ఫోన్ పీసీ పని చేస్తుంది.
- పొందుపరిచిన క్వాల్‌కమ్ ప్రొసెసింగ్ వ్యవస్థ నాణ్యమైన పనితీరును ప్రదర్శిస్తుంది.
- ఈ టాబ్లెట్ పీసీలో, కాల్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ తరహా వ్యవస్థను పొందుపరిచారు.
- గ్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్లపరిచేందుకు ఎడిర్నో200 గ్రాఫిక్ ప్రొసెసర్ కార్డును టాబ్లెట్ పీసీలో ఏర్పాటు చేసారు.
- పొందుపరిచిన 3జీ వ్యవస్థ, వేగవంతమైన 7.2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ యాక్సిస్ కు ఉపకరిస్తుంది.
- 7 అంగుళాల సామర్ధ్యం గల డిస్ ప్లే, 800 x 480 పిక్సల్ రిసల్యూషన్‌తో టచ్‌స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- 155 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 2జీబీర్యామ్, 4జీబీ రోమ్, 32జీజీ ఎక్స్‌ప్యాండబుల్ విధానం వినియోగదారుడికి మరింత లబ్థి చేకూరుస్తుంది.
- పొందుపరిచిన మీడియా ప్లేయర్ వివిధ ఆడియో, వీడియో ఫార్మాట్లకు ఉపకరిస్తుంది.
- బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్లికేషన్లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.
- పటిష్ట 4200 mAh బ్యాటరీ వ్యవస్థ 8 గంటల బ్యాకప్ తో పాటు, 300 గంటల స్టాండ్ బై కలిగి ఉంటుంది.
- టాబ్లెట్ కు సంవత్సరం, లోపలి ఉపకరణాలకు 6 నెలల వారంటీని స్పైస్ ఇస్తుంది.
- రూ.12000లకు ఈ టాబ్లెట్ పీసీ ప్రముఖ స్టోర్లలో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot