అతిపెద్ద సూపర్ కంప్యూటర్!

Posted By: Prashanth

అతిపెద్ద సూపర్ కంప్యూటర్!

 

లండన్: యూరప్‌లోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ‘కాస్మోస్’ను ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ‘న్యూమరికల్ కస్మాలజీ-2012’ శిక్షణా సదస్సులో ఈ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు.

ఈ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు, పదార్థ నిర్మాణ శాస్త్రవేత్తలు, ఇతర విద్యావేత్తలు ఉమ్మడిగా పంచుకునే అవకాశముంది. విశ్వ రహస్యాల చేధనలో భాగంగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కాస్మోస్ లాంటి సూపర్ కంప్యూటర్ల ఉపయోగపడతాయని హాకింగ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

విశ్వరహస్య మూలానికి సంబంధించి చిట్టచివరి సిద్ధాంతాన్ని మానవుడు ఏదో ఒక రోజు కనిపెట్టి తీరతాడని హాకింగ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంతాన్ని కనిపెట్టినా.. మానవులు ఇలాగే ఎందుకు ప్రవరిస్తారో తెలుసుకోవడానికైనా సూపర్ కంప్యూటర్ల అవసరముందని హాకింగ్ తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot