తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?

Posted By:

సరిగ్గా అరిచేతిలో ఇమిడిపోతున్న ట్యాబ్లెట్ పీసీలు ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్ తదితర కమ్యూనికేషన్ లావాదేవీలను సమృద్ధిగా నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే వివిధ ధర వేరియంట్‌లలో ట్యాబ్లెట్ పీసీలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్పెసిఫికేషన్‌ల బట్టి ధరలు ఉంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ట్యాబ్లెట్ పీసీని కొనుగోలు చేద్దామనుకునే వారికోసం గిజ్‌బాట్ పలు సలహాలను అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?

ఆపరేటింగ్ సిస్టం ఎంపిక:

మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. ఈ వోఎస్ అనేక కొత్త అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్ వేగవంతంగా స్పందించాలి:

ప్రస్తుత ట్రెండ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ల పై నడుస్తోంది. అయితే మీరు ఎంపిక చేసుకుబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కు ఉపకరించాలంటే 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌లను ఎంపిక చేసుకోవచ్చు.

ర్యామ్ పనితీరు:

మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ మన్నికైన పనితీరును కనబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్‌లో ట్యాబ్లెట్ పీసీని ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ ఉత్తమం.

ఇంటర్నల్ మెమెరీ:

మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ 4జీ ఇంటర్నల్ మెమరీ వ్యవస్థను కలిగి ఉండాలి. అంతేకాకుండా మెమరీని మరింత పెంచుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఆప్షన్ తప్పనిసరిగా ఉండాలి.

కనెక్టువిటీ ఆప్షన్‌లు:

మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వాయిస్ కాలింగ్ ను సపోర్ట్ చేసే విధంగా సింగిల్ లేదా డ్యూయల్ సిమ్ స్లాట్ ఆప్సన్ ను కలిగి ఉంటే మంచిది. వై-ఫై, ఎడ్జ్, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు ట్యాబ్లెట్ కనెక్టువిటీని మరింత బలోపేతం చేస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting