సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ప్యాక్‌తో 15 నిమిషాల్లో ఫోన్ మొత్తం చార్జ్!

|

స్మార్ట్‌ఫోన్.. టాబ్లెట్.. స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఇలా అనేకమైన అత్యాధునిక సాంకేతిక పరికరాలు నేటి యాంత్రిక ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. పరిశోధకులు అనేకమైన సాంకేతక ఆవిష్కరణలను సుసాధ్యం చేస్తున్నప్పటికి స్మార్ట్ పరికరాల బ్యాటరీ లైఫ్‌ను పెంచటంలో విఫలమవుతూనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న అనేక మందిని ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ప్రముఖ కంపెనీ యూఎన్‌యూ (UNU), అల్ట్రాపాక్ (Ultrapak) పేరుతో సూపర్-ఫాస్ట్ చార్జింగ్ ఉపకరణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

 
15 నిమిషాల్లో ఫోన్ మొత్తం చార్జ్!

అల్ట్రా-ఎక్స్ (Ultra-X) చార్జింగ్ టెక్నాలజీని కలగి ఉండే ఈ ప్రత్యేకమైన ఎ+ (A+) లిథియమ్ పాలిమర్ బ్యాటరీలు సాధారణ బ్యాటరీతో పోలిస్తే 8 రెట్లు వేగంగా ఫోన్‌లను చార్జ్ చేస్తాయి. అంటే ఈ సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 15 నిమిషాల్లో మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ను చార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్‌లోని చార్జింగ్ శాతాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకమైన ఎల్ఈడి డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రెండు కాన్ఫిగరేషన్‌లలో ఈ బ్యాటరీ ప్యాక్ లభ్యమవుతోంది. డ్యూయల్ యూఎస్బీ పోర్ట్‌తో కూడిన 10,000 ఎమ్ఏహెచ్ వర్షన్ సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ప్యాక్‌ ధర 99.99 డాలర్లు. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వర్షన్ ధర 59.99 డాలర్లు. ప్రీఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అగష్ట్ 24 నుంచి షిప్పింగ్ ఉంటుంది.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Super-Fast Battery Pack Can Fully Charge Your Phone in 15 Minutes. Read more in 
 Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X