ఇండియాలో స్వింగ్ టెల్ ఎంట్రీ వెనుక కారణం..?

Posted By: Prashanth

ఇండియాలో స్వింగ్ టెల్ ఎంట్రీ వెనుక కారణం..?

 

కంప్యూటింగ్ ఉత్పత్తుల అమ్మకాలు భారత్‌లో జరోందుకుంటున్న నేపధ్యంలో స్వింగ్ టెల్ సంస్ధ తన మొట్ట మొదటి టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ పేరు ‘హల్లో ట్యాబ్’, 7 అంగుళల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉత్తమ కంప్యూటింగ్ అనుభూతలను కలిగిస్తుంది.

ఆండ్రాయిడ్ 2.3 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం పై టాబ్లెట్ రన్ అవుతుంది. లోడ్ చేసిన క్వాల్కమ్ MSM7x27 సర్ఫ్ ప్రాసెసర్ 800 MHz క్లాక్ వేగంతో డివైజ్ పనితీరును మరింత బలపరుస్తుంది. పొందుపరిచిన అడిర్నో గ్రాఫిక్ వ్యవస్థ క్వాలిటీతో కూడిన గ్రాఫిక్ విజువల్స్‌ను సమకూరుస్తుంది. బ్లూటూత్ 2.1, వై-ఫై 802.11 b/g/n వ్యవస్థలు టాబ్లెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని ధ్ళడపరుస్తాయి. ర్యామ్ సామర్ధ్యం 16జీబి, ఎక్స్ టర్నల్ మెమెరీ 32జీబి. పొందుపరిచిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీజీఏ పిక్సల్ కలిగి క్వాలిటీ లైవ్ ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు. సిల్వర్ మరియు బ్లాక్ కలర్ వేరియంట్‌లలో పీసీలు లభ్యం కానున్నాయి. వాయిస్ కాలింగ్ సౌలభ్యతను టాబ్లెట్‌లో కల్పించారు. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే మొబైల్ సిమ్‌ను ఏర్పాటు చేసిన స్లాట్‌లో అమర్చుకోవల్సి ఉంటుంది. ధర రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot