మార్కెట్లోకి స్వైప్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెబ్
స్వైప్ టెలికామ్ 'స్వైప్ హాలో వాల్యూ+' పేరుతో తక్కువ ధర వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‍ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ స్వైప్ హాలో వాల్యూకు సక్సెసర్ వర్షన్. స్వైప్ హాలో వాల్యూ+ యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లను కలిగి వినియోగదారులకు స్మార్ట్ కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తుంది. ఈ డివైజ్‌ను భారత్‌లోని ప్రముఖ రిటైలింగ్ స్టోర్లు రూ.6,699 ధరకు విక్రయిస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ట్యాబ్లెట్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ సామర్ధ్యం 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ర్యామ్ సామర్ధ్యం (512ఎంబి లేదా 1జీబి). 512ఎంబి ర్యామ్ సామర్ధ్యంతో కూడిన స్వైప్ హాలో వాల్యూ+ ధర రూ.6,699. 1జీబి ర్యామ్ సామర్ధ్యంతో కూడిన స్వైప్ హాలో వాల్యూ+ ధర రూ.6,999.
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ట్యాబ్లెట్ పరిమాణం 11.3మిల్లీమీటర్లు, బరువు 380 గ్రాములు, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్ఎమ్ రేడియో).
ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌లు: స్పైస్ మొబైల్స్
ఇండియన్ మొబైల్ మార్కెట్లో తమ సంస్థకు 2.5శాతం వాటా ఉన్నట్లు స్పైస్ మొబైల్స్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగపు అధిపతి రోహన్ కురియన్ మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్‌లను వినూత్న సాంకేతికతతో తయారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు స్పైస్‌క్లౌడ్ వెబ్‌సైట్‌లో సభ్యత్వం తీసుకున్నట్లయితే 2జీబి డేటా వారకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఒకవేళ ఫోన్ ఇంటిదగ్గర మర్చిపోయినప్పటికి వెబ్‌సైట్ సాయంతో ఆ డేటాను చూసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ పై మరింత దృష్టిసారించినట్లు కురియన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








