స్వైప్ సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్ ‘హాలో వాల్యూ’.. రూ.6999కే!

Posted By:

స్వైప్ సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్ ‘హాలో వాల్యూ’.. రూ.6999కే!
కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్వైప్ టెలికామ్ 'హాలో వాల్యూ 2జీ' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్‌ను దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. ధర రూ.6,999. ఈ కంప్యూటింగ్ డివైజ్ ద్వారా మాట్లాడుకునే సదుపాయాన్ని కలిపించారు. ఇందుకు గాను రెండు ప్రత్యేక వాయిస్ కాలింగ్ సిమ్ స్లాట్‌‍లను ఏర్పాటు చేశారు. ఈ జెల్లీబీన్ ఆధారిత డివైజ్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా..........

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

బరువు ఇంకా చుట్టుకొలత: చుట్టుకొలత 197 x 124 x 10.9మిల్లీ మీటర్లు, బరువు 335 గ్రాములు,

డిస్‌ప్లే: 7 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ ట‌చ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వర్షన్ (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్ అప్లికేషన్, లైవ్ వాల్‌పేపర్ సపోర్ట్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్),

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ,

బ్యాటరీ: 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్ అన్‌లాక్ సెక్యూరిటీ అప్లికేషన్, పానోరమిక్ షాట్స్ అప్లికేషన్, ఈ-బుక్ రీడర్, ఆలివ్ ఆఫీస్ ప్రీమియమ్, ఆడోబ్ ఫ్లాష్ సపోర్ట్ 11.1 వర్షన్.

ధర ఇతర అందుబాటు వివరాలు: ఇండియన్ మార్కెట్లో 'స్వైప్ హాలో వాల్యూ ట్యాబ్లెట్' ధర రూ.6,999. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు ఈ డివైజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot