స్వైప్ కొత్త టాబ్లెట్ ‘వెలాసిటీ టాబ్’.. జెల్లీబీన్ వోఎస్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్!

Posted By: Staff

స్వైప్ కొత్త టాబ్లెట్ ‘వెలాసిటీ టాబ్’.. జెల్లీబీన్ వోఎస్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్!

 

కాలిఫోర్నియా ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగించే  ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్వైప్ టెలికామ్, దేశీయ విపణిలోకి వెలాసిటీ టాబ్  (Velocity Tab) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను తీసుకువచ్చింది.  ఆధునిక

స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.11,490. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

చుట్టుకొలత & బరువు: 209 x 163 x 0.5మిల్లీ మీటర్లు, బరువు 330 గ్రాములు,

డిస్‌ప్లే:  8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 5 పాయింట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ప్రాసెసర్: డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ (హైస్పీడ్ కంప్యూటింగ్ ఇంకా వేగవంతమైన బ్రౌజింగ్),

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.1 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్),

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్:  1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,  32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

బ్యాటరీ: 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల బ్యాటరీ బ్యాకప్),

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot