రూ.4,999కే స్వైప్ కంప్యూటింగ్ టాబ్లెట్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్వైప్ ‘స్లైస్' పేరుతో సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్లాక్, రెడ్, బ్లూ, ఎల్లో ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ కంప్యూటింగ్ డివైస్‌ను ప్రముఖ రిటైలర్ Amazon.in రూ.4,999కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్వైప్ స్లైస్ టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ8312 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్,2జీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








