స్వైప్ డ్యూయల్ సిమ్ టాబ్లెట్ వచ్చేసింది.. ధర రూ.11,999!

Posted By: Prashanth

స్వైప్ డ్యూయల్ సిమ్ టాబ్లెట్ వచ్చేసింది.. ధర రూ.11,999!

 

స్వైప్ టెలికామ్ తన మొట్టమొదటి ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్ ‘స్వైప్ టాబ్ ఆల్‌ ఇన్‌ వన్’ను సోమవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.11,999. తొలత ఈ డివైజ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై రన్ అయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావించాయి. డ్యూయల్ సిమ్ స్లాట్ టాబ్లెట్‌కు ప్రధాన ఆకర్షణగా పేర్కొనవచ్చు. ఈ సిమ్ స్లాట్‌ల ద్వారా 3జీ కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

‘స్వైప్ టాబ్ ఆల్ ఇన్ వన్’ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

డిస్‌ప్లే: చాక్లెట్ బ్రౌన్ కలర్ శరీర నిర్మాణం, 7 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1028 x 768పిక్సల్స్),

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్ & ర్యామ్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 3, ఇన్-బుల్ట్ జీపీఎస్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

అదనపు ఫీచర్లు: ఎఫ్ఎమ్ రీసీవర్ & ట్రాన్స్‌మిటర్, జీ- సెన్సార్, జీపీఎస్, యాక్సిలరోమీటర్, ఫ్లాష్ సపోర్ట్ 11.1, ఆలివ్ ఆఫీస్ ప్రీమియమ్, ఈ-బుక్ రీడర్, ఆడియో రికార్డింగ్, హైడెఫినిషన్ 3డి గేమ్స్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot