రచ్చ రాజుకుంది..?

By Prashanth
|
Swipe Tab All in One vs Karbonn Agnee
బడ్జెట్ ఫ్రండ్లీ టాబ్లెట్ పీసీల అమ్మకాలు దేశీయ మార్కెట్లో జోరందుకుంటున్న నేపధ్యంలో దేశీయ టాబ్లెట్ తయారీ కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. నేటి ట్రెండ్ అభిరుచులకు అనుగుణంగా వీటి రూపకల్పన ఉంటోంది. తక్కువ ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న ఈ పోర్టబుల్ పీసీలలో సిమ్‌కార్డ్ స్లాట్, 3జీ వంటి ఫీచర్లు అనివార్యమయ్యాయి.

తాజాగా, కాలిఫోర్నియా సంస్థ స్వైప్ టెలికామ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందించే డ్యూయల్ సిమ్ స్వైప్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.11,999. మరోవైపు కార్బన్ మొబైల్స్ 3జీ సిమ్‌కార్డ్ సపోర్టింగ్ ఫీచర్‌తో కూడిన ‘అగ్ని’ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారితంగా స్పందిస్తుంది. ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా....

 

డిస్‌ప్లే....

స్వైప్ టాబ్లెట్: 7 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1028 x 768పిక్సల్స్),

 

కార్బన్ అగ్ని: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఆపరేటింగ్ సిస్టం....

స్వైప్ టాబ్లెట్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్,

కార్బన్ అగ్ని: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్,

ప్రాసెసర్......

స్వైప్ టాబ్లెట్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,

కార్బన్ అగ్ని: 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,

స్టోరేజ్....

స్వైప్ టాబ్లెట్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కార్బన్ అగ్ని: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా....

స్వైప్ టాబ్లెట్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కార్బన్ అగ్ని: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ...

స్వైప్ టాబ్లెట్: డ్యూయల్ సిమ్ సపోర్ట్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, ఇన్-బుల్ట్ జీపీఎస్, 3జీ,

కార్బన్ అగ్ని: సిమ్‌కార్డ్ స్లాట్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, ఇన్-బుల్ట్ జీపీఎస్, 3జీ,

బ్యాటరీ....

స్వైప్ టాబ్లెట్: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

కార్బన్ అగ్ని: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....

స్వైప్ టాబ్లెట్: రూ.11,999,

కార్బన్ అగ్ని: రూ.10,000.

ప్రీలోడెడ్ అప్లికేషన్స్.......

స్వైప్ టాబ్లెట్: ఎఫ్ఎమ్ రిసీవర్ & ట్రాన్స్ మిటర్, జీ-సెన్సార్, జీపీఎస్, యాక్సిలరోమీటర్, ఫ్లాష్ సపోర్ట్ 11.1, ఆలివ్ ఆఫీస్ ప్రీమియమ్, ఈ-బుక్ రీడర్, ఆడియో రికార్డింగ్, హైడెఫినిషన్, 3డీ గేమ్స్,

కార్బన్ అగ్ని: స్మార్ట్ బ్రౌజర్, కార్బన్ స్మార్ట్ గేమ్స్, ఫేస్ బుక్, టీవోఐ ఇంకా ఈటీ అప్లికేషన్స్. మొత్తం 22 దేశీయ భాషలను ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది.

తీర్పు......

వేగవంతమైన ప్రాసెసర్, రేర్ కెమెరా, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ సిమ్ స్లాట్ సౌలభ్యతలను కోరుకునే వారికి స్వైప్ టాబ్లెట్ ఉత్తమ ఎంపిక. మరో వైపు ప్రాంతీయ భాషా సపోర్ట్ ను కోరుకునే వారికి కార్బన్ అగ్సి బెస్ట్ చాయిస్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X