రసిక సుందరి సొగసుల నడుమ!

Posted By: Super

రసిక సుందరి సొగసుల నడుమ!

గబ్బర్‌సింగ్ ‘కెవ్వు కేక’ పాటతో యావత్ తెలుగు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ మలైకా ఆరోరా బుధవారం అమెరికా సంస్థ స్వైప్ టెలికామ్ భారత్‌లో ప్రవేశపెట్టిన టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించారు. ‘స్వైప్ 3డీ లైఫ్’, ‘టాబ్ ఎక్స్78’, ‘టాబ్ ఎక్స్74ఎస్’ మోడళ్లలో విడుదలైన ఈ డివైజ్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా సొంతం చేసుకోవచ్చు. స్వైప్ 3డీ లైఫ్ భారత్ లో విడుదలైన తొలి 3డీ టాబ్లెట్ కావటం విశేషం. మరో డివైజ్ టాబ్ ఎక్స్74ఎస్ ఫోన్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది.

స్వైప్ 3డీ లైఫ్ ఫీచర్లు:

ఉత్తమ క్వాలటీ 3డీ ఎంటర్‌టైన్‌మెంట్, ఆండ్రాయిడ్ 4.03 ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్, సీపీయూ-ఏ13 కార్టెక్స్ ఏ8 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ, వై-ఫై, 3జీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), జీ-సెన్సార్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్.

టాబ్ ఎక్స్74ఎస్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.03 ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్, సిమ్‌కార్డ్ సపోర్ట్, వై-ఫై, 1.5గిగాహెట్జ్ సామర్ధ్యం గల ఏ10 ప్రాసెసర్, 1జీబి డీడీఆర్ ర్యామ్, 3800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, 2మెగాపిక్సల్ రేర్ కెమెరా,1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జీ-సెన్సార్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

టాబ్ ఎక్స్78 కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.03 ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్,1.5గిగాహెట్జ్ బాక్స్ చిప్ ఏ13 ప్రాసెసర్, జీపీయూ మాలీ 400 హైఎండ్ ప్రాసెసర్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 8GB/16GB, వై-ఫై, 3జీ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot