అరిచేతిలో ఆటల ప్రపంచం..!!

Posted By: Prashanth

అరిచేతిలో ఆటల ప్రపంచం..!!

 

కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఆటల ప్రపంచాన్ని చేరువ చేస్తూ గేమింగ్ పరికరాల ఉత్పత్తిదారు ‘JXD’ టాబ్లెట్ కంప్యూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ‘JXD S7100’గా డిజైన్ కాబడిన ఈ గేమింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ప్రధాన ఫీచర్లు:

* టాబ్లెట్ డిస్ ప్లే 7 అంగుళాలు, * కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * మాలీ 400 జీపీయూ వ్యవస్థ, * 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * 16జీబి ఇంటర్నల్ స్టోరేజి, * వై-ఫై, * హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ, * ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ సింగిల్ ఛార్జ్ తో 4గంటల వెబ్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు.

ఈ పీసీలో నిక్షిప్తం చేసిన గేమింగ్ వ్యవస్థ ఆటల ప్రపంచంలో మిమ్మల్ని విహరింప చేస్తుంది. ఇందుకు అనువుగా ఉండే విధంగా స్ర్కీన్ కు ఇరు వైపులా గేమింగ్ బటన్ లను ఏర్పాటు చేశారు. పొందుపరిచిన ప్రాసెసర్ అదే విధంగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లు డివైజ్ పని వేగాన్ని వేగవంతం చేస్తాయి.

మన్నికైన పీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఆపిల్ ఐకాన్ లను మైమరిపించే తత్వం తదితర అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఇండియన్ మార్కెట్లో ‘JXD S7100’ ధర రూ.10,000లోపే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting