తగ్గాపోరుగా.. 'శ్యామ్ సంగ్ గేలక్సీ - మోటరోలా గ్జూమ్'

Posted By: Staff

తగ్గాపోరుగా.. 'శ్యామ్ సంగ్ గేలక్సీ - మోటరోలా గ్జూమ్'

విశ్వవ్యాప్తంగా ‘టాబ్లెట్ పీసీ’ల జోరు ఊపందుకుంటున్న తరుణమిది. అలనాడు ‘యాపిల్ ’ ప్రవేశపెట్టిన ‘ఐప్యాడ్’ ప్రపంచ కంప్యూటర్ వ్యవస్థలో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని ఎవరూ ఊహించలేదు. కోకొల్లలుగా పుట్టుకొచ్చిన తయారీ వ్యవస్థలు ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వినియోగదారులను ఆకట్టకునే విధంగా వ్యూహాలను అనుసరిస్తున్నాయి.

కంప్యూటింగ్ వ్యవస్థలో మార్పులు చోటచేసుకున్న నేపధ్యంలో ‘టాబ్లెట్ పీసీ’లకు క్రేజ్ పెరిగిపోయింది. అరచేతిలో వైకుంఠాన్ని చూపించే స్థాయికి టాబ్లట్ పీసీలు రూపాంతరం చెందాయి. వీటికి డిమాండ్ పెరిగిన నేపధ్యంలో పలు కంపెనీలు పలు మోడళ్లలో వీటిని ప్రవేశపెట్టాయి. కాంపీటీషన్ పెరగటంతో వీటి ధరలు దిగొచ్చాయి. అన్నితరగతి ప్రజల తాహతకు అందుబాటులో ఉండే విధంగా పాకెట్ సైజు కంప్యూటర్లు దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుత ‘టాబ్లెట్ పీసీ మార్కెట్’ను పరిశీలిస్తే రెండు బ్రాండ్‌ల టాబ్లెట్ పీసీలు హాట్ కేకుల్లా అమ్మడైపోతున్నాయి. వాటి పేర్లే.. ‘మోటరోలా గ్జూమ్, శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1’, మార్కెట్లో నువ్వా.. నేనా అన్న ఛందంగా దూసుకుపోతున్న ఈ ట్యాబ్లెట్లు కంప్యూటింగ్ మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి.

10.1 అంగుళాల వైశాల్యం కలిగిన డిస్‌ప్లే సామర్థ్యాలతో రూపొందించబడ్డ ఈ రెండు టాబ్లెట్లు
విశిష్టమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టకుంటున్నాయి. 3.1 వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థతో శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1 పనిచేస్తే, 3.0 వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థతో మోటరోలా గ్జూమ్ పని చేస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీమీడియా వంటి అంశాలకు సంబంధించి ఈ రెండు బ్రాండ్ల టాబ్లెట్లు ఏ విషయంలోనూ రాజీ లేకుండా పోటి పడుతున్నాయి. నాణ్యమైన మ్యూజిక్‌తో పాటు క్వాలిటీ విడియో ప్లే బ్యాక్ ను వినియోగదారులకు ఈ టాబ్లెట్ పీసీలు అందిస్తున్నాయి. ఆడియోకు సంబంధించి MP3, WAV, వీడియోకు సంబంధించి MP4, AVI, 3GP, VOB ఫార్మాట్లలో ఈ టాబ్లెట్లు సహకరిస్తాయి.

శక్తివంతమైన ప్రాసెసర్లతో ఇమిడి ఉన్న ఈ టాబ్లెట్లకు సామర్థ్యంతో కూడిన అత్యుత్తమ గ్రాఫిక్ సపోర్ట్ మరో అదనం. వీటిలో అనుసంధానించబడని NVIDIA టెగ్రా ప్రాసెసర్, 1GB RAMలు వ్యవస్థను వేగవంతంగా నడిపించటంతో పాటు సమయాన్ని ఆదా చేస్తాయి. అత్యాధినిక సమాచార, సాంకేతిక వ్యవస్థతో కూడికుని ఉన్న 3G, GPRS, EDGE వంటి ఆధునిక వ్యవస్థలను ఈ టాబ్లెట్లు సపోర్టు చేస్తాయి. అయితే మోటరోలా గ్జూమ్ లో మాత్రం అధునాతన 4జీ వ్యవస్థ పనిచేయాలంటే మైనర్ హార్డ్ వేర్ పనులను అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది.

శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1లో మెమరీకి సంబంధించి 16,32,64 GBల వేరియంట్స్ ఉన్నాయి. అయితే మోటరోలా గ్జూమ్‌లో ఉన్న ఎక్సటర్నల్ మెమరీ స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే వెసలుబాటు శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1లో లేదు. బ్లూటూత్ , వై - ఫై వంటి ఆధునిక ఆప్షన్లు ఈ టాబ్లెట్లలో ఉన్నాయి. అయితే మోటరోలా గ్జూమ్ లో ఉన్న HDMI ఆప్షన్ శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1లో లేదు. వీటి ధరల విషయానికి వస్తే మోటరోలా గ్జూమ్ ధర రూ.35,000, శ్యామ్‌సంగ్ గేలక్సీ ట్యాబ్ 10.1 ధర రూ.29000 పలుకుతోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot