వీకెండ్ స్పెషల్: తక్కువ ధర టాబ్లెట్ పీసీల వివరాలు

Posted By: Staff

వీకెండ్ స్పెషల్: తక్కువ ధర టాబ్లెట్ పీసీల వివరాలు

 

ఇండియన్ మార్కెట్లో టాబ్టెల్ కంప్యూటర్ల మార్కెట్ మరింత విస్తరణ దిశగా ముందుకు సాగుతోంది. వ్యాపారానికి ఈ స్ధావరం అనువుగా ఉండటంతో పలు విదేశీ కంపెనీలు ఇక్కడ పాగా వేస్తున్నాయి.

మేమేమి తక్కువతినలేదన్నట్లు పలు స్వదేశీ కంపెనీలు సైతం రేస్‌లో ఉన్నాయి. చాలా మంది టాబ్లెట్ కంప్యూటర్ ఖరీదైన వస్తువని అనకుంటున్నారు. మారిన పరిస్థితుల నేపధ్యంలో అత్యాధునిక పీచర్లతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్లు సాధారణ ధరకే లభ్యమవుతున్నాయి. వాటి వివరాలు క్లుప్తంగా..

పాన్‌టెల్ టీ-ప్యాడ్ ఐఎస్701ఆర్ (Pantel T-Pad IS701R): ఈ టాబ్లెట్ ధర కేవలం రూ.3250. ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై పీసీ రన్ అవుతుంది. శక్తివంతమైన 1జిగాహెడ్జ్ ప్రాసెసర్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది.

యూబీస్లేట్ 7 ప్లస్ (Ubislate 7 Plus): పటిష్టమైన కార్టెక్స్ ఏ8-700 ప్రాసెసర్ పై టాబ్లెట్ రన్ అవుతుంది. మన్నికైన బ్యాకప్ నిచ్చే 3200 mAh బ్యాటరీని నిక్షిప్తం చేశారు. ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, వై-పై, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ధర రూ. 2,999.

ఏట్యాబ్ (Atab): ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. ర్యామ్ సామర్ధ్యం 512ఎంబీ, ఇంటర్నల్ స్టోరేజ్ 2జీబి, దీనికి 16జీబికి పెంచుకోవచ్చు. సమర్థవంతమైన

1.1 జిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ధర 4,000.

విష్‌టెల్ ఐఆర్ఏ (IRA): ఈ టాబ్లెట్ ధర 4,000. పీచర్లను పరిశీలిస్తే 7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, 256 ఎంబీ ఇంటర్నల్ ర్యామ్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, బరవు 370 గ్రాములు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot