మీ ఫేస్‌బుక్ చరిత్ర మొత్తం ఒక్క వీడియోలో

Posted By:

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఫిబ్రవరి 4, 2014తో 10 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ బృందం ‘‘Look Back'' పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీ ఫేస్‌బుక్ చరిత్ర మొత్తం ఒక్క వీడియోలో

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన సందర్భాలు అంటే బాగా నచ్చిన పోస్టులు ఇంకా ఫోటోలను వీడియో ట్రైలర్ రూపంలో వీక్షించవచ్చు. ఈ వీడియోలను తమ తమ టైమ్‌లైన్‌లకు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీ ఫేస్‌బుక్ మధుర స్మృతులను ‘‘Look Back'' ఫీచర్ ద్వారా వీడియో రూపంలో వీక్షించేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 4, 2004న ప్రారంభించబడిన ప్రముఖ సామాజిక సంబంధాల మాద్యమం ఫేస్‌బుక్ సరిగ్గా నేటితో 10 వసంతాలను పూర్తి చేసుకోనుంది. అమెరికాకు చెందిన మార్క్ జూకర్‌బర్డ్ అతని సహచర బృందంతో కలిసి ఈ సోషల్ నెట్‌వర్కింగ్ వారధిని ప్రపంచానికి పరిచయం చేసారు. అనతి కాలంలోని అనూహ్యరీతిలో పుంజుకున్న ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 126కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

ఈ సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారిలో 70 శాతం మంది యూజర్లు యువతే కావటం ఓ విశేషం. ఇండియా వంటి దేశాల్లో ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot