మార్కెట్లోకి లోప్టీ టాబ్లెట్‌‌లు

Posted By: Prashanth

మార్కెట్లోకి లోప్టీ టాబ్లెట్‌‌లు

 

న్యూఢిల్లీ: టెలికాం సాధనాల తయారీ కంపెనీ టెరాకాం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంటీఎన్‌ఎల్‌తో కలిసి శుక్రవారం, మూడు టాబ్లెట్‌ పీసీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ‘ఎంటీఎన్‌ఎల్‌ భాగస్వామ్యంలో మేము మూడు మోడళ్లను ప్రవేశపెడుతున్నాము. వీటిలో హైఎండ్‌ రకమైన ‘లోఫ్టీ’ టాబ్లెట్‌కు రూ.10,999 ధర నిర్ణయించగా, ఎంట్రీ లెవెల్‌ టాబ్లెట్‌ ధర రూ.3,999గా నిర్ణయించాము’ అని టెరాకాం చెైర్మన్‌, మేనేజింగ్‌ డెైరెక్టర్‌ ముఖేష్‌ అరోరా మీడియా కు తెలిపారు. హై ఎండ్‌ మోడల్‌ టాబ్లెట్‌లో 3జీ సిమ్‌ కార్డును ఉపయోగించి ఫోన్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చన్నారు. లోఫ్టీ టాబ్లెట్‌ ఇతర మోడళ్లలో వెైఫెై, 3జీ డోంగిల్స్‌(యూఎస్‌బీ హార్డ్‌వేర్‌ పరికరం) సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎంటీఎన్‌ఎల్‌, సీఎండీ ఏకే.గార్గ్‌ మాట్లాడుతూ... ‘ మేము ఈ టాబ్లెట్‌లను పూర్తిగా పరీక్షించాము. మా వినియోగదారులు వీటిని ఆదరిస్తారు’ అని అన్నారు. లోఫ్టీ టాబ్లెట్‌ కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు 3జీ నెట్‌వర్క్‌పెై 10జీబీ వరకు ఇంటర్నెట్‌ యూసేజ్‌ను టెరాకాంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎంటీఎన్‌ఎల్‌ వారికి అందిస్తుంది. ఈ 10జీబీ తొలి రెండు నెలలవరకు ఉపయోగించటానికి వీలుందని ఎంటీఎన్‌ఎల్‌ ఎక్జిక్యూటివ్‌ డెైరెక్టర్‌ ఎకె. భార్గవ తెలిపారు. ఈ టాబ్లెట్లన్ని గూగుల్‌ అండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌గా తయారుచేశారు. వీటిని న్యూఢిల్లీలోని ఎంటీఎన్‌ఎల్‌ సంచార్‌ హట్‌లో, టెరాకాం స్టోర్లలో అమ్మాలని నిర్ణయించారు. కాగా ‘మరికొన్ని రోజుల్లో 500 రిటైల్‌ అవుట్‌లెట్లలో ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నాము’ అని భార్గవ అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot