ఆపిల్ మ్యాక్‌బుక్‌... మైక్రోసాఫ్ట్ పీసీల మధ్య 9 వ్యత్యాసాలు!

Posted By: Super

ఆపిల్ మ్యాక్‌బుక్‌... మైక్రోసాఫ్ట్  పీసీల మధ్య 9 వ్యత్యాసాలు!

 

కంప్యూటింగ్ ప్రపంచంలో ఆపిల్ మ్యాక్‌బుక్ అలాగే మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ల మధ్య సంవత్సరాల కాలంగా ఆధిపత్య పోరు నడుస్తూ వస్తోంది. తాజాగా మైక్రోసాఫ్ట్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసిన నేపధ్యంలో ఆ ప్రభావం మ్యాక్‌బుక్‌ల పై ఏ మేరకు చూపనుందన్నసందిగ్థత పలువురిలో నెలకుంది. పోటాపోటీ ఫీచర్లతో అత్యుత్తమ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య 9 వ్యత్యాసాలను ఇప్పుడు చూద్దాం...

డిజైనింగ్ విషయంలో మ్యాక్‌లదే పై చేయి!

మ్యాక్‌బుక్‌ల రూపకల్పన విషయంలో ఆపిల్ ప్రత్యేక శద్ధను కనబరుస్తుంది. మైక్రోసాఫ్ట్ పీసీల డిజైనింగ్ విషయంలో ఒక్కొ కంపెనీ ఒక్కొలా వ్యవహరిస్తుంది. ఏదేమైనప్పటికి మైక్రోసాఫ్ట్ పీసీలతో పోలిస్తే మ్యాక్‌బుక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

విండోస్ సాఫ్ట్‌వేర్ విస్తృతంగా అందుబాటులో ఉంది!

మ్యాక్ వర్షన్ సాఫ్ట్‌వేర్‌లతో పోలిస్తే విండోస్ వర్షన్ సాఫ్ట్‌వేర్ విస్తృతంగా అందుబాటులో ఉంది. ఉదాహరణకు: మైక్రోసాఫ్ట్ ఆఫీస్.

మ్యాక్‌బుక్‌లు ఖరీదు కూడుకుని ఉంటాయి!

విండోస్ ఆధారిత పీసీలతో పోలిస్తే

మ్యాక్‌బుక్‌లు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ఉదాహరణకు: మార్కెట్లోకి తాజాగా విడుదలైన రెటీనా డిస్‌ప్లే‌తో కూడిన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర $2,200.

హార్డ్‌కోర్ పీసీ గేమర్‌లకు విండోస్ ఉత్తమం!

హార్డ్‌కోర్ గేమింగ్ విభాగంలో మ్యాక్‌బుక్‌లను మైక్రోసాఫ్ట్ పీసీలు అధిగమించాయి. మైక్రోసాఫ్ట్ పీసీలకు గ్రాఫిక్ కార్డ్స్ ఇంకా మెమరీ కార్డ్‌లను జత చేయటం ద్వారా పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు. మ్యాక్‌బుక్‌లకు సంబంధించి ఈ వ్యవహారం ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

కస్టమర్ సపోర్ట్ విషయంల మ్యాక్ దే పై చేయి!

కస్టమర్ సపోర్ట్ విషయంలో ఆపిల్ మ్యాక్, మైక్రోసాఫ్ట్ పీసీలను అధిగమించగలిగింది. కారణం ఆపిల్ స్టోర్‌లు అధికంగా ఉండటమే. మ్యాక్‌బుక్‌లోని సమస్యను ఓ సెషన్‌లో ఫిక్స్ చేసినట్లయితే సదరు రిపేరింగ్ ఖర్చులను ఆపిల్ వసూలు చేయదట.

రెండు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంలే!

వినియోగం విషయంలో మ్యాక్‌బుక్ అలాగే మైక్రోసాప్ట్ పీసీలు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉంటాయి. సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు.

మాల్వేర్ ఇంకా వైరస్‌ల నుంచి మ్యాక్‌బుక్‌లు సురక్షితమైనవి!

ఆధునిక వర్షన్ సెక్యూరిటీ ఫీచర్లను మ్యాక్ వోఎస్‌లలో పొందుపరచటంతో మాల్వేర్ ఇంకా వైరస్‌ల భారి నుంచి మ్యాక్‌బుక్‌లు త్వరగా బయటపడగలగుతాయి.

వివిధ వెరైటీల హార్డ్‌వేర్‌లతో మైక్రోసాఫ్ట్ పీసీలు!

నచ్చిన హార్డ్‌వేర్ వర్షన్‌లలో మైక్రోసాఫ్ట్ పీసీలను ఎంపిక చేసుకోవచ్చు. హెచ్‌పి, ఏసర్, లెనోవో, డెల్ వంటి బ్రాండ్‌లు వివిధ హార్డ్‌వేర్ వర్షన్‌లలో మైక్రోసాఫ్ట్ పీసీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి.

మ్యాక్‌లో విండోస్ వోఎస్‌లకు చోటుంది!

మ్యాక్‌బుక్‌లలో విండోస్ వోఎస్‌లను సైతం రన్ చేసుకోవచ్చు. మ్యాక్‌లో నిక్షిప్తం చేసిన బూట్ క్యాంప్ అనే ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ చర్యతో ఒకే మ్యాక్ బుక్‌లో విండోస్ అలాగే మ్యాక్ వోఎస్‌ల పనితీరును ఆస్వాదించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot