ఆకాష్ కొత్త మోడల్ రిలీజ్ ఎప్పుడు..?

Posted By: Prashanth

ఆకాష్ కొత్త మోడల్ రిలీజ్ ఎప్పుడు..?

 

ప్రపంచంలో అతి తక్కువ ఖరీదు కలిగిన టాబ్లెట్‌గా ‘ఆకాష్’ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆకాష్ టాబ్లెట్ కమర్షియల్ వర్షన్ ‘యూబీస్లేట్ 7’ (Ubislate 7) పీసీలు మార్కెట్లో హాట్ కేకు్ల్లా అమ్ముడవుతున్నాయి. ఈ డిమాండ్ నేపధ్యంలో ‘యూబీస్లేట్ 7’కు అపగ్రేడెడ్ మోడల్ గా ‘యూబీస్లేట్ 7 ప్లస్’ను ఈ జనవరిలో విడుదల చేస్తున్నట్లు ఆకాష్ అధికార వర్గాలు ప్రకటించాయి.

అప్‌గ్రేడెడ్ మోడల్ ‘యూబీస్లేట్ 7 ఫ్లస్’ ప్రత్యేకతలు:

* గుగూల ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 700 MHz కార్టెక్స్ A8 ప్రాసెసర్, * హై డెఫినిషన్ వీడియో కో ప్రాసెసర్, హై డెఫినిషన్ వీడయో ప్లే బ్యాక్ సపోర్ట్, * వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ సపోర్ట్, * జీపీఆర్ఎస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సపోర్ట్, * 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * ఇంటర్నల్ మెమరీ 2జీబి, ఎక్సటర్నల్ సోరేజ్ మెమరీ 32జీబి, * బ్యాటరీ బ్యాకప్ 180 నిమిషాలు, * 3.5 mm స్టాండర్డ్ ఆడియో జాక్, * యూఎస్బీ కనెక్టువిటీ పోర్ట్.

పాత వర్షన్ ‘యూబీస్లేట్ 7’ ప్రత్యేకతలు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

* 366 MHz ARM-11 ప్రాసెసర్,

* బ్యాటరీ బ్యాకప్ 90 నిమిషాలు,

* 256 ఎంబీ ర్యామ్,

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే.

యూబీస్లేట్ 7 ధర రూ.2500కాగా, యూబీస్లేట్ 7 ప్లస్ ధర రూ.4,000. ముందుగా బక్ చేసుకునే ఓత్సాహికులు ubislate.comలోకి లాగినై పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot