రెడ్ హాట్ తోషిబా ల్యాప్‌టాప్..!!

Posted By: Super

రెడ్ హాట్ తోషిబా ల్యాప్‌టాప్..!!

 

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సాంకేతిక పరికరాల తయారీదారు ‘తోషిబా’ తన తాజా ఎడిషన్ ల్యాప్‌టాప్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. ప్రత్యేకించి గేమింగ్ కోసం రూపొందించిన ‘తోషిబా క్వాస్మియో X770’ హాట్ హాట్ రెడ్ లుక్స్‌తో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

హైడెఫినిషన్ సామర్ధ్యం గల 17.3 అంగుళాల డిస్ ప్లే, 3డీ మూవీ, రెడ్ ఆన్ స్టీల్ పెయింట్ స్కీమ్ మరియు గేమింగ్ సౌలభ్యత ఈ ల్యాపీలోని ప్రత్యేకతలు. పొందుపరిచిన ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్, న్విడియా జీఫోర్స్ GTX 560M గ్రాఫిక్ కార్డ్ ఇతర ఫీచర్లు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ధర రూ.80,000 నుంచి రూ.లక్ష వరకు ఉంది.

ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచిన అత్యాధునిక సౌలభ్యతల ద్వారా హైడెఫినిషన్ నాణ్యతలో వీడియోలను వీక్షించటంతో పాటు ఎడిట్ చేసుకోవచ్చు. 3డీ గ్లాసెస్ ఆధారితంగా 3డీ కంటెంట్‌ను వీక్షించాల్సి ఉంది. ఈ గ్లాసుల కోసం అదనంగా 100 పౌండ్లు చల్లించాల్సి ఉంది. పనితీరు విషయంలో నిక్కిచ్చిగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యానాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

ల్యాపీలోని నెలకున్న ప్రతికూలతలను పరిశీలిస్తే, 3.4 కేజీల బరువు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. పోర్టుబులటీ అంశంలోనూ ఆసౌకర్యానికి గురి కావల్సి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ రెండున్నర గంటలు మాత్రమే. ఏదేమైనా ఈ ల్యాపీని కొనదలుచుకున్న గేమింగ్ ప్రియులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot