ఈ ప్రింటర్ కాగితం పై చకాచకా నడిచేస్తూ!

Posted By:

 ఈ ప్రింటర్ కాగితం పై చకాచకా నడిచేస్తూ!

టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఒక కొత్త ఆవిష్కరణను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా జుటా ల్యాబ్స్ అనే కంపెనీ ఓ విప్లవాత్మకైన ప్రింటింగ్ రోబోట్‌ను ఆవిష్కరించింది. సరిగ్గా జేబులో ఇమిడిపోయే ఈ పాకెట్ సైజ్ వైర్‌లెస్ ప్రింటింగ్ రోబోట్ మీ ఆదేశానుసారం కాగితం పై నడుస్తూ చకాచకా అక్షరాలను రాసేస్తుంటుంది. వైర్‌లెస్ కనెక్టువిటీ సాయంతో కంప్యూటర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ప్రింటర్‌ను అనుసంధానించుకోవల్సి ఉంటుంది.

ఈ ప్రయోగాత్మక ప్రింటర్ రూపకల్పనలో భాగంగా ఇజ్రాయిల్‌కు చెందిన జుటా (zuta) ల్యాబ్స్ భారీగా నిధులను సమీకరిస్తోంది. జుటా ల్యాబ్స్ ఈ ప్రింటర్‌ను 2015 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థులు, లాయర్లు ఇంకా వ్యాపార వేత్తలకు ఈ ప్రింటర్ మరింత అనువుగా ఉంటుంది. ఎటువంటి కాగితం పైనైనా ఈ ప్రింటర్ చకచకా పనిచేసేస్తుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Ybrhomrv4Hk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot