రాబోతుంది ..‘జిటాక్స్’వారి ధృడమైన టాబ్లెట్ పీసీ!!

Posted By: Super

రాబోతుంది ..‘జిటాక్స్’వారి ధృడమైన టాబ్లెట్ పీసీ!!

 

కంప్యూటింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో ‘టాబ్లెట్ పీసీల’ సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుంది. టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘జిటాక్స్’ Z2710 వర్షన్లో ధృడమైన టాబ్లెట్ పరికరాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

ఫీచర్లు క్లుప్తంగా:

- 5 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరని ధృడత్వం,

- దుమ్ము, ధూళి కణాల నుంచి కాపాడేతత్వం, వాటర్ ప్రూఫ్ సౌలభ్యత,

- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ( v2.3 వర్షన్),

- యూజర్ ఫ్రెండ్లీ సామర్ధ్యం గల 7 అంగుళాల పటిష్టమైన డిస్ ప్లే,

- 16జీబీ స్టోరేజి సామర్ధ్యం,

- హె డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

-802.11 b/g/n సామర్ధ్యం గల వేగవంతమన వై-ఫై కనెక్టువిటీ,

- జీపీఎస్ వ్యవస్థకు అనూకూలించే విధంగా ‘జియోటాగ్గింగ్’ వ్యవస్థ ,

- వేగవంతమైన బ్లూటూత్,

- యూఎస్బీ పోర్ట్స్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్స్, సిమ్ కార్డ్ వంటి మల్టిపుట్ కనెక్టువిటీ సదుపాయాలు,

- వివిధ ఉష్ణోగ్రతల్లో పనిచేసే విధంగా అత్యాధునిక ఫీచర్లను ఈ పీసీలో నిక్షిప్తం చేశారు.

మిలటరీ గ్రేడ్ ‘MIL-STD-810G’ రేటింగ్ సాధించిన ఈ టాబ్లెట్ పీసీ అమ్మకాలలో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుందని జిటాక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు పీటర్ మోలినియక్స్ ధీమా వ్యక్తం చేశారు. ధర, విడుదల తేది ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot