బ్లూస్మార్ట్ సూట్‌కేస్: ప్రయాణంలో మీకు పర్సనల్ అసిస్టెంట్

Posted By:

ఆధునిక సాంకేతిక పోకడలతో ముందుకు సాగుతున్న మనిషి నిత్యం కొత్త ఆవిష్కరణలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా చోటుచేసుకున్న మరో ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది.

బ్లూస్మార్ట్ సూట్‌కేస్: ప్రయాణంలో పర్సనల్ అసిస్టెంట్

Image source: indiegogo.com

బ్లూస్మార్ట్ అనే ప్రముఖ టెక్నాలజీ స్టార్టప్ ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్ కనెక్టువిటీ ప్రయాణ సూట్‌కేస్‌ను తయారు చేసింది. ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ బ్యాగ్‌ను యాపిల్ అలానే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

బ్లూస్మార్ట్ క్యారీ‌ఆన్ స్మార్ట్ సూట్‌కేస్ ప్రత్యేకతలు:

- సూట్‌కేస్‌ను ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఫోన్‌లకు కనెక్ట్ చేసుకుని నియంత్రించుకునే సౌకర్యం,
- పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన డిజిటిల్ లాక్ సిస్టం,
- శక్తివంతమైన ఇన్‌బుల్ట్ బ్యాటరీ (మీ స్మార్ట్‌డివైస్‌లను 6సార్లు పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు),
- ప్రాక్సిమిటీ సెన్సార్,
- సూట్‌కేస్ ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టేందుకు లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్,
- మీరు చేసే ప్రయాణాలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని ఈ స్మార్ట్ సూట్‌కేస్ తన ట్రిప్ ట్రాకింగ్ ఫీచర్‌లో నిక్షిప్తం
చేస్తుంది,

- బిల్ట్-ఇన్ డిజిటల్ స్కేల్ (ఈ ఫీచర్ ద్వారా సూట్‌కేస్ తన బరువును తానే తూకం వేసుకుని మీకు ఆ సమాచారాన్నితెలుపుతుంది).

ఆధునిక ప్రయాణ అవసరాలకు అనుగుణంగా డిజైన్ కాబడిన బ్లూస్మార్ట్ క్యారీ ‌ఆన్ స్మార్ట్ సూట్‌కేస్‌‌లు ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే లభ్యమవుతున్నాయి. ధర 250 డాలర్లు.

English summary
The Travel Bag That Can Weigh Itself and Charge Your Gadgets. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot