ఉత్తర కొరియాపై నిప్పులు చెరిగిన అమెరికా, ఆ దాడి కిమ్ పనే !

Written By:

ఉత్తరకొరియాపై అమెరికా నిప్పులు చెరిగింది. ప్రపంచదేశాలను గజగజలాడించిన 'వాన్నా క్రై' సైబర్‌ దాడి.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా పనే అని అమెరికా ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ హోమ్‌ల్యాండ్‌ భద్రతా సలహాదారు టామ్‌ బోసర్ట్‌ ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రాసిన కథనంలో పేర్కొన్నారు. 'వాన్నా క్రై ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాడి. ఉత్తరకొరియానే ఈ దాడికి పాల్పడిందని టామ్‌ ఆరోపించారు.

రష్యా పంజా విప్పితే, భయంతో విలవిలలాడిపోతున్న బ్రిటన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రత్యక్షంగా దాడికి

ఈ దాడి మీద గతంలో పరోక్షంగా సంబంధం ఉందంటూ  అమెరికా ఆరోపణలు చేసినప్పటికీ ఈ సారి ప్రత్యక్షంగా దాడికి దిగింది. తాను వూరికే ఈ ఆరోపణలు చేయట్లేదని.. అందుకు బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయని టామ్‌ తన కధనంలో పేర్కొన్నారు.

కొన్ని గంటల వ్యవధిలోనే ..

కాగా ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా వాన్నా క్రై సైబర్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 150 దేశాల్లోని 3లక్షల కంప్యూటర్లు ఈ దాడికి గురయ్యాయి. ఈ దాడి వల్ల పలు దేశాల ప్రభుత్వ వ్యవస్థల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి.

గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి..

గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన తెలిపారు. 

బలమైన ఆధారాలు..

అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అమెరికా బలమైన ఆధారాలు సంపాదించింది'' అని ఆయన తను రాసిన కథనంలో తెలిపారు.

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన

కాగా, 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్‌ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్‌ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. వైట్‌హౌస్‌ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు..

ఇలాంటి దాడులను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని, అంతేగాక అణు, క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు కూడా అమెరికా చర్యలు చేపడుతోందన్నారు.

తీరు మార్చుకోకపోతే ..

ఇప్పటికే ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఆ దేశంపై అనేక ఆంక్షలు తీసుకొచ్చినట్లు తెలిపారు. తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశం మరింత ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

కిమ్‌ ప్రభుత్వం మాత్రం..

కిమ్‌ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవటం విశేషం. మరి ముందు ముందు అమెరికా ఆరోపణలకు కిమ్ ఏ విధంగా సమాధానం ఇస్తారనేది విశ్లేషకులను కలవరపాటుకు గురిచేస్తోంది.

వాన్నాక్రై అసలు పేరు వాన్నా క్రిప్ట్‌..

కాగా ఈ వాన్నాక్రై అసలు పేరు వాన్నా క్రిప్ట్‌. ఈ ర్యాన్సమ్‌వేర్‌ అనేది మాల్‌ వేర్లలో ఒకరకం. ర్యాన్సమ్‌ అంటే డబ్బులిచ్చి చెరనుంచి విడిపించుకోవడం. 

హ్యాకింగ్‌ టూల్‌ను తస్కరించిన సైబర్‌ దొంగలు..

అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్‌ టూల్‌ను తస్కరించిన సైబర్‌ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్‌ వేర్‌ వైరస్‌ను రూపొందించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The US sees North Korea behind 'WannaCry' cyber attack More News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot