ట్యాబ్లెట్ పీసీల ద్వారా ఇప్పటికి సాధ్యం కాని 8 అంశాలు!

Posted By:

మనం నిజంగా పోస్ట్-పీసీ ప్రపంచంలోకి ప్రవేశించామా..? డెస్క్‌టాప్ ఇంకా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లకు కాలం చెల్లినట్లేనా..?, ట్యాబ్లెట్ పీసీలు సౌకర్యవంతమైన కంప్యూటిగ్‌ను అందిస్తున్నాయా.? ట్యాబ్లెట్ పీసీల్లో ఇప్పటికి సాధ్యం కాని ఫీచర్లేంటి..?

చాలిచాలని మెమరీ స్పేస్:

కొత్త ఐప్యాడ్
ఇంకా ఇతర ఆధునిక వర్షన్ ట్యాబ్లెట్ పీసీలు ఆకర్షణీయమైన డిస్‌ప్లే, ఆప్షనల్ 4జీ కనెక్టువిటీ ఇంకా అత్యుత్తమ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. స్టోరేజ్ విషయంలో మాత్రం ఆయా గాడ్జెట్‌లు పరిణితం చెందటం లేదు. 16జీబి, 32జీబి, 64జీబి వేరింయట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యాపిల్ అభిమానులు 128జీబి ఐప్యాడ్ మోడల్ కోసం ఎదరుచూస్తున్నారు. మార్కెట్లో లభ్యమవుతన్న పలు ల్యాప్‌టాప్‌లు 1-TB హార్డ్‌డ్రైవ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటున్నాయి. స్టోరేజ్ విషయంలో మరో అడుగు ముందున్న పలు డెస్క్‌టాప్ కంప్యూటర్ మోడళ్లు 2-TB హార్డ్‌డ్రైవ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటున్నాయి. స్టోరేజ్ విషయంలో ట్యాబ్లెట్ పీసీలు మరింత పరిణితి చెందాల్సి ఉంది.

ట్యాబ్లెట్ పీసీల ద్వారా ఇప్పటికి సాధ్యం కాని 8 అంశాలు!

ట్యాబ్లెట్ వినియోగం నొప్పే..?

పని వాతావరణాల్లో పర్సనల్ కంప్యూటర్‌ల స్థానాలను ట్యాబ్లెట్ పీసీలు భర్తి చేసేస్తున్నాయి. ఫ్యాక్టరీ ఫ్లోర్స్, హాస్సటల్స్, రెస్టారెంట్స్ ఇలా అనేక చోట్ల ట్యాబ్లెట్ పీసీల వినియోగం ముమ్మరమవుతోంది. ట్యాబ్లెట్ పీసీలను అదే పనిగా ఉపయోగించటం కారణంగా మెడ సంబంధిత రుగ్మతలు చుట్టుముట్టే అవకాశముందని నిపుణులు హెచ్చిరుస్తున్నారు.

గేమింగ్ అనుభూతులు అంతంత మాత్రమే!

యాపిల్ నుంచి విడుదలైన కొత్త ఐప్యాడ్ సరికొత్త రెటీనా డిస్‌ప్లే ఇంకా క్వాడో‌కోర్ గ్రాఫిక్ వ్యవస్థలను కలిగి గేమింగ్‌కు అనువుగా ఉన్నప్పటికి డివైజ్ టచ్ డిస్‌ప్లే కీబోర్డ్ లేదా గేమ్ ప్యాడ్‌కు మ్యాచ్ కావటం లేదు.

ప్రింటింగ్ సమస్యలు!

డెస్క్‌టాప్ ఇంకా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లతో పోలిస్తే ట్యాబ్లెట్ ద్వారా ప్రింటింగ్ చర్య కొంతమేర తికమకగా ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot