యాపిల్ కంపెనీలో ఉద్యోగమే వద్దన్నాడు!!

Posted By:

యాపిల్ కంపెనీలో ఉద్యోగమంటే ఆ హుందానే వేరు. ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. సరిగ్గా అలాంటి అవకాశమే అమెరికాకు చెందిన 19 ఏళ్ల కుర్రవాడు జాన్ మేయర్‌కు దక్కింది. అయితే ఈ కుర్రవాడు మాత్రం యాపిల్ కంపెనీ వారిచ్చిన ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించాడు. సొంతంగా వ్యాపారం చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటానంటూ థీమా వ్యక్తం చేస్తున్నాడు.

యాపిల్ కంపెనీలో ఉద్యోగమే వద్దన్నాడు!!

న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో తన చదువును అర్థంతరంగా నిలిపివేసిన జాన్ మేయర్ హైస్కూల్‌ స్థాయి నుంచే మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు. జాన్ ఇప్పటి వరకు దాదాపు 40 అప్లికేషన్‌ల వరకు వృద్థి చేసి రికార్డు నెలకొల్పాడు.

జాన్ ప్రతిభను గుర్తించిన యాపిల్ సహా అనేక కంపెనీలు ఉద్యోగంలో చేరాలంటూ ఆహ్వానాలు పంపాయి. వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించిన ఈ ఐఓఎస్ అప్లికేషన్ డెవలపర్ సొంతంగా వ్యాపారం చేసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలన్న ఆకాంక్షతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ట్యాప్ మీడియా పేరుతో సొంతంగా కంపెనీ ఆరంభించి మొబైల్ అప్లికేషన్లు వృద్థి చేయటం ప్రారంభించాడు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
This 19-Year-Old Developer Is So Successful, He Turned Down Apple. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot