యాపిల్ సీక్రెట్‌లను లీక్ చేస్తున్న ఘనుడు!

Posted By:

 యాపిల్ సీక్రెట్‌లను లీక్ చేస్తున్న ఘనుడు!

తనకంటూ ప్రత్యేకమైన ఆన్‌లైన్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ ఆస్ట్రేలియన్ టీనేజర్ యాపిల్ రహస్యాలను బహిర్గతం చేస్తూ ఇంటర్నెట్ ప్రపచంలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తున్నాడు. మెల్‌బోర్న్ నగరంలో అమ్మానాన్నలతో కలిసి జీవిస్తున్న సోనీ డిక్సన్, యాపిల్ తాజా ఆవిష్కరణలకు సంబంధించన వివరాలను ముందుగానే బహిర్గతం చేస్తున్నాడు. గురువారం, ఈ టీనేజర్ యాపిల్ లేటెస్ వర్షన్ ఐఫోన్‌కు సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ http://sonnydickson.com/లో ప్రచరించాడు. యాపిల్ తన కొత్తవర్షన్ ఐఫోన్‌ను వచ్చే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

మంగళవారం (సెప్టంబర్ 10న) ఆవిష్కరించనున్న నేపధ్యంలో, డిక్సన్ బహిర్గతం చేసిన వివరాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. యాపిల్ తన ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను చివరి నిమిషం వరకు ఎంతో జాప్యంగా ఉంచుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో కొత్త ఐఫోన్‌కు సంబంధించిన వివరాలను ఆవిష్కరణకు ముందుగానే వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేయటం పట్ల యాపిల్ అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటిర్వ్యూలో సోనీ డిక్సన్ స్పందిస్తూ తనకు చైనాలో యాపిల్ గాడ్జెట్ల తయారీకి సంబంధించిన వివరాలను తెలిపేందుకు 5 నుంచి 10 వనరులు ఉన్నాయని, వాళ్లిచ్చిన సమాచారం మేరకు తాను ఆ వివరాలను తన పేరుమీద ఉన్న  వెబ్‌సైట్ ఇంకా య్యూటూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో తన యాడ్ రివెన్యూ పెరుగుతూ వస్తోందని డిక్సన్ వెల్లడించారు. ఈ పరిణామాల పై యాపిల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot