ఈ దీపావళికి అదిరిపోయే ఆఫర్: RTX 50 సిరీస్ ల్యాప్‌టాప్‌లతో డబుల్ ధమాకా!
దీపావళి అంటేనే చాలా కంపెనీలు పండగ ఆఫర్లతో హోరెత్తించడం సహజమే. ఈ దీపావళికి ల్యాప్‌టాప్‌ను అప్ గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా? గేమింగ్‌ను అద్భుతంగా ఆస్వాదించడంతో పాటు ఏఐ వర్క్‌లోడ్స్‌ను కూడా అత్యంత వేగంగా రన్ చేసే ఎన్‌విడియా ఆర్టీఎక్స్ 50 సిరీస్(NVIDIA RTX 50 Series) ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు గేమింగ్ ల్యాప్‌టాప్ అంటే కేవలం ఆటలు ఆడుకోవడానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు అది సంక్షిష్టమైన ఏఐ మోడళ్లను రన్ చేసే శక్తివంతమైన యంత్రంగా రూపాంతరం చెందింది. నిజానికి గేమింగ్ అనేది ల్యాప్‌టాప్‌పై పడే అత్యంత కష్టతరమైన ఏఐ వర్క్‌లోడ్లలో ఒకటి. అందుకే ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్‌టాప్‌లు గేమింగ్‌తో పాటు ఆధునిక ఏఐ పనులను కూడా అంతే సమర్థవంతంగా పూర్తి చేయగలవు.
మీరు గేమ్‌లలో డీఎల్ఎస్ఎస్ టెక్నాలజీని ఉపయోగించి ఉంటే మీరు ఇప్పటికే ఏఐని ఉపయోగిస్తున్నట్లే లెక్క. డీఎల్ఎస్ఎస్ ద్వారా మీ స్క్రీన్‌పై కనిపించే చాలా ఫ్రేమ్స్ గేమ్ నేరుగా రెండర్ చేసినవి కావు. ఓ న్యూరల్ నెట్వర్క్ మోడల్ ద్వారా ప్రతి సెకనుకు అనేక ఫ్రేమ్‌లను లెక్కిస్తూ ఒరిజినల్ ఫ్రేమ్‌కి సరిసమానంగా తయారుచేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీఎల్ఎస్ఎస్ 4.5 వెర్షన్.. ఒరిజినల్ వెర్షన్ కంటే 5 రెట్ల వేగవంతమైన కంప్యూట్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో ఉండే మల్టీ ఫ్రేమ్ జనరేషన్, డైనమిక్ మల్టీ ఫ్రేమ్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా ప్రతీ నేటివ్ ఫ్రేమ్‌కు అదనంగా 5 ఫ్రేమ్స్ వరకు క్రియేట్ చేయవచ్చు. ఇది సాధారణ గ్రాఫిక్స్ ట్రిక్ కాదు, గేమ్ ప్రొడ్యూస్ చేసిన సమాచారాన్ని విశ్లేషించి తర్వాతి ఫ్రేమ్‌లో ఏం రాబోతోందో కొన్ని మిల్లీ సెకన్లలో అంచనా వేసే అత్యంత శక్తివంతమైన ఏఐ పనితీరు.

ఈ ల్యాప్‌టాప్‌లలో ఉండే 'టెన్సార్ కోర్స్' ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ యాక్సిలరేటర్లు. మీరు ఆడే గేమ్‌లో తదుపరి ఫ్రేమ్‌ను అంచనా వేసే ఈ ప్రాసెసంగ్ యూనిట్లే, లాంగ్వేజ్ మోడళ్లను రన్ చేయడానికి, చిత్రాలను రూపొందించడానికి, ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్‌కు, డాటా సెట్ల వర్గీకరణకు కూడా ఉపయోగపడతాయి. ఎన్‌విడియా తన డీఎల్ఎస్ఎస్ ను వేగవంతం చేసిన ప్రతిసారీ, మీ ల్యాప్‌టాప్ లో రన్ అయ్యే ఇతర ఏఐ వర్క్‌లోడ్స్ కూడా ఆటోమేటిక్ గా వేగవంతం అవుతాయి. అందుకే మీరు కేవలం గేమింగ్ కోసం కొనుగోలు చేసినప్పటికీ.. అత్యుత్తమ ఏఐ సామర్థ్యం కలిగిన ల్యాప్‌టాప్ మీ సొంతం అవుతుంది.
LM Studio, Ollama వంటి ఉచిత టూల్స్ సాయంతో లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను(LLMs) నేరుగా మీ జీపీయూపై రన్ చేసుకోవచ్చు. దీనివల్ల డేటా మీ ల్యాప్‌టాప్‌లోనే భద్రంగా ఉంటుంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ComfyUI వంటి సాధనాలతో ఉచితంగా ఇమేజెస్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలో సబ్‌టైటిల్స్ తయారీ, ఆడియో క్లీనప్, ఫోటోలలో అవాంఛిత వస్తువుల తొలగింపు, 3డీ రెండరింగ్ డెనాయిసింగ్ వంటి అనేక రోజు వారీ పనులను ఈ టెన్సార్ కోర్స్ సులభంగా వేగవంతం చేస్తాయి.
ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఏఐ కోసం వేగవంతమైన టెన్సార్ కోర్లతో పాటు ఎక్కువ వీడియో మెమరీని అందించారు. అదే సమయంలో గేమింగ్ కోసం డీఎల్ఎస్ఎస్ 4.5, 6X మల్టీ ఫ్రేమ్ జనరేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీరు ఏఐ కోసం కొనుగోలు చేసినా గేమింగ్ మిషన్ లభిస్తుంది. గేమింగ్ కోసం కొనుగోలు చేసినా పూర్తి స్థాయి ఏఐ మిషన్ లభిస్తుంది. దీపావళి సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేక ఆఫర్ ధరల్లో గేమింగ్, ఏఐ రెండింటిలోనూ రాణించే ఆర్టీఎక్స్ 50 సిరీస్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications
