హడలెత్తిస్తున్న స్టోన్‌డ్రిల్ వైరస్

మీ అనుమతి లేకుండానే డివైస్ మొత్తం లాక్ అయిపోతుంది.ఆపరేషన్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.

|

కంప్యూటర్ హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లోని డేటా మొత్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్టోన్నమాల్వేర్ ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ Kaspersky Lab ఈ మాల్వేర్‌ను స్టోన్‌డ్రిల్‌గా గుర్తించింది.

హడలెత్తిస్తున్న స్టోన్‌డ్రిల్ వైరస్

ఇక Paytmలో జియో రీఛార్జ్ ప్లాన్స్, డిస్కౌంట్స్ కూడా..

ఈ మాల్వేర్‌లో spy చేయటానికి అవసరమైన మాడ్యుల్స్‌తో పాటు ఫైల్స్‌లోని డేటాను ఎన్‌క్రిప్ట్ చేయగలిగే ransomwareను కూడా హ్యాకర్లు ఉంచినట్లు క్యాస్పర్ స్కై చెబుతోంది. 32బిట్, 64బిట్ కాన్ఫిగరేషన్‌లతో కూడిన కంప్యూటర్‌లలో, ఒక్కసారి గనుక ఈ మాల్వేర్ ఇన్‌స్టాల్ అయినట్లయితే ఆ కంప్యూటర్‌లలోని డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

35,000 కంప్యూటర్లు హ్యాక్..

35,000 కంప్యూటర్లు హ్యాక్..

గతంలో ఇటువంటి మాల్వేర్ ఒకటి సౌదీ అరేబియా కంపెనీకి చెందిన 35,000 కంప్యూటర్లను హ్యాక్ చేసిన వాటిలోని డేటాను పూర్తిగా తుడిచి పెట్టేసింది. యాంటీవైరస్ అలానే ఇతర సెక్యూరిటీ మెకానిజమ్స్ ద్వారా ఈ మాల్వేర్ కంప్యూటర్ లలోకి ప్రవేశించే ఆస్కారం ఉందని Kaspersky Lab హెచ్చరిస్తోంది.

Ransomware అంటే ఏంటి..?

Ransomware అంటే ఏంటి..?

 


పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులను డిమాండ్ చేయటం, ఇవ్వకపోతే వాళ్లని హతమార్చటం వంటి ఉదంతాలను సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాంటిదే ఈ Ransomware. మీ కంప్యూటర్‌లోని ముఖ్యమైన డేటాను మీకు తెలియకుండా దొంగిలించి, దాన్నీ మీకు తిరిగిచ్చేందుకు చేసే బ్లాక్‌మెయిలింగ్‌‌నే రాన్సమ్‌వేర్‌గా కంప్యూటర్ పరిభాషలో మనం అభివర్ణించుకుంటున్నాం. Ransomwareకు సంబంధించి టెక్నికల్ భాగాన్ని పరిశీలించినట్లయితే...

క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్
 

క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్

Ransomware అనేది సైబర్ క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్. దీన్నీ మీ పీసీలో హోస్ట్ చేసినట్లయితే, మీ అనుమతి లేకుండానే డివైస్ మొత్తం లాక్ అయిపోతుంది. అంతేకాదు, ఫోన్ ఆపరేషన్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇక్కడి నుంచి సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభిస్తారు. కొంత నగదు చెల్లిస్తేనే ఫోన్‌ను అన్‌లాక్ చేస్తామని హెచ్చరికలు పంపుతుంటారు. ఈ నగదు చెల్లింపు అనేది బిట్ కాయిన్స్ ఇంకా ఇతర డిజిటల్ కరెన్సీల రూపంలో చేయాల్సి ఉంటుంది.

చాలా రకాలుగా ఉంటుంది

చాలా రకాలుగా ఉంటుంది

Ransomware అనేది చాలా రకాలుగా ఉంటుంది. గుర్తుపట్టలేని విధంగా ఉండే Ransomware ఫైల్, మీ కంప్యూటర్‌లోకి సాదారణ ఫైల్ మాదిరిగానే ఉంటుంది. ఈ ప్రమాదకర ఫైల్ గనుక మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే పీసీలోని అన్ని ఫైల్స్ మీకు తెలియకుండానే ఒక్కొక్కటికి ఎన్‌క్రిప్ట్ కాబడతాయి. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే సిస్టం మొత్తం ఎన్‌క్రిప్ట్ కాబడినట్లు ఓ ఎర్రర్ మెసేజ్ స్ర్కీన్ పై ప్ర్తత్యక్షమవుతుంది.

 పెద్దమొత్తంలో నగదు డిమాండ్..

పెద్దమొత్తంలో నగదు డిమాండ్..

పీసీలో లాక్ చేసిన డేటాను అన్‌లాక్ చేయాలంటే పెద్దమొత్తంలో నగదు తమకు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తుంటారు. ఒకవేళ ఆ మొత్తం వాళ్లకు చెల్లించినా, మొత్తం సమాచారం వచ్చే అవకాశం తక్కువేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని నిర్ణీత గడువులోపు చెల్లించిన పక్షంలో డేటా మొత్తాని అటాకర్లు డిలీట్ చేసేస్తారు.

ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు

ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు

Ransomware అనేది ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు. వెబ్ సైట్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఇతర మాల్వేర్ల ద్వారా ఏ రూపంలోనైనా మీ డివైస్ లోకి చొరబడగలదు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు

అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు

క్రిప్టోలాకర్, క్రిప్టోవాల్, లాకీ, సమాస్, సమ్‌సమ్, సమ్‌సా ఇలా అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. వీటిలో ప్రధానమైన క్రిప్టోలాకర్ అనే రాన్సమ్‌వేర్‌ను సెప్టంబర్ 5, 2013లో గుర్తించారు. ఈ రాన్సమ్‌వేర్‌‌ను ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్‌లను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ తయారు చేసుకున్నారు.

Locky

Locky

మరో రాన్సమ్‌వేర్‌ అయిన Lockyని ఫిబ్రవరి 2016లో గుర్తించారు. మైక్రోసాప్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ రూపంలో ఉండే ఈ రాన్సమ్‌వేర్‌ ఫైల్ క్రిప్టోలాకర్ కంటే ప్రమాదకరమైనది.

Best Mobiles in India

English summary
This Malware Could Erase All Your Data From Your Hard Disk Drive. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X