చవక ధర..క్వాలిటీ కంప్యూటంగ్

Posted By: Super

చవక ధర..క్వాలిటీ కంప్యూటంగ్

 

చవక ఆండ్రాయిడ్ టాబ్లెట్‌‌లకు మార్కెట్లో ఊహించని ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ సంస్థ ఐనోల్ నోవో పాలాడిన్ (Ainol Novo Paladin) స్లీక్ డిజైన్‌తో కూడిన చవక టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పని చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో లోడ్ కాబడిన ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్ విలువ రూ.7990. అత్యాధునిక కంప్యూటింగ్ ఫీచర్లను ఈ పీసీలో నిక్షిప్తం చేశారు.

Ainol Novo 7 Paladin టాబ్లెట్‌లోని ముఖ్య విశేషాలు:

స్లీక్ మరియు పల్చటి డిజైనింగ్, జేబులో సౌకర్యవంతంగా ఇమిడేతత్వం.

7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

ఇంటర్నెట్ వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది.

ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్ కొరకు డివైజ్ లో 1జిగాహెడ్జ్ సామర్ధ్యం గల సింగిల్ కోర్ ప్రాసెసర్ ను దోహదం చేశారు.

3జీ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ.

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్,

వన్‌టచ్ గుగూల్ ప్లే యాక్సిస్,

మన్నికైన బ్యాకప్ నిచ్చే 400 mAh బ్యాటరీ.

ఫేస్‌బుక్ ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించి సౌలభ్యత ఉంటుంది. మీరు పెట్టే రూ.7990 పెట్టుబడికి పూర్తి స్ధాయి భరోసాను ఈ డివైజ్ కల్పిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot